రైతు భరోసాపథకంపై జగన్ మాట తప్పారు: మాజీమంత్రి అచ్చెన్నాయుడు

By Nagaraju penumalaFirst Published Oct 15, 2019, 12:16 PM IST
Highlights

బూత్ లెవెల్ ఆఫీసర్ చేయాల్సిన పనులను కూడా వైసీపీ నియమించిన వాలంటీర్లు ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ మాత్రమే ఓట్లు పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన అధికారి విజయానంద్ ను కోరారు.  

అమరావతి: వైసీపీ వాలంటీర్లు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారంటూ ఆరోపించారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరుడగట్టిన వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకుని తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. 

ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్ కి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీనేతల ఓట్లు తొలగింపుతోపాటు పలు అంశాలపై ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు.  

కొత్త ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కొత్త వ్యవస్థ తీసుకువచ్చారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. 

బూత్ లెవెల్ ఆఫీసర్ చేయాల్సిన పనులను కూడా వైసీపీ నియమించిన వాలంటీర్లు ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ మాత్రమే ఓట్లు పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన అధికారి విజయానంద్ ను కోరారు.  

ఈ సందర్భంగా రైతు భరోసా పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు అచ్చెన్నాయుడు. వైసీపీ ప్రభుత్వం రైతులను నయవంచనకు గురిచేసిందని ఆరోపించారు. ఒక్కొక్కరికి 12,500 ఇస్తాం అని హామీ ఇచ్చి ఇప్పుడు సీఎం మాట తప్పారని నిలదీశారు. రైతు భరోసా ఎంత మందికి ఇస్తాం, ఎంత ఇస్తాం అని  జగన్ మ్యానిఫెస్టోలో పెట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు.
 

click me!