నెల్లూరు వైసీపీలో విభేదాలు.. జగన్‌తో ముగిసిన అనిల్ కుమార్ యాదవ్ భేటీ, మరోసారి గెలవాలన్న సీఎం

Siva Kodati |  
Published : Jun 26, 2023, 08:39 PM IST
నెల్లూరు వైసీపీలో విభేదాలు.. జగన్‌తో ముగిసిన అనిల్ కుమార్ యాదవ్ భేటీ, మరోసారి గెలవాలన్న సీఎం

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ ముగిసింది. దాదాపు 45 నిమిషాల పాటు అనిల్‌తో జగన్ మాట్లాడారు. నెల్లూరు సిటీలో మరోసారి విజయబావుటా ఎగురవేస్తామని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

నెల్లూరు సిటీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ వైసీపీ నేత రూప్ కుమార్ యాదవ్ మధ్య విభేదాల నేపథ్యంలో సోమవారం సీఎం వైఎస్ జగన్‌తో తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో అనిల్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు అనిల్‌తో జగన్ మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో, నెల్లూరు సిటీలో  పార్టీ పరిస్థితులపై జగన్ చర్చించారు. నెల్లూరు సిటీ పార్టీలో విభేధాలు, తాజా రాజకీయ పరిణామాలపై సీఎంకు వివరించారు అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు జిల్లా, సిటీల్లో పార్టీ పటిష్టంగా ఉందని సీఎం అన్నట్లుగా తెలుస్తోంది. 

ALso Read: ఊపిరి వున్నంత వరకు జగన్‌తోనే.. 2024లోనూ వైసీపీ అభ్యర్ధిని నేనే , గెలిచేది నేనే : అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరు సిటీలో మరోసారి విజయబావుటా ఎగురవేస్తామని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ నేతలంతా  కలసికట్టుగా నడిచి పార్టీ ఘనవిజయం కోసం కృషి చేయాలని జగన్ నేతలకు సూచించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ది పనులకు నిధులు ఇవ్వాలని జగన్‌ను కోరారు అనిల్ కుమార్ యాదవ్. దీనిపై స్పందించిన జగన్..పెండింగ్  పనులకు అవసరమైన నిధులు వెంటనే విడుదల  చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే సత్వరమే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?