ఏం జరిగినా నాపేరు లాగుతారా.. వ్యక్తిగత గొడవలతోనే కోటంరెడ్డిపై దాడి : అనిల్ కుమార్ యాదవ్

Siva Kodati |  
Published : Nov 27, 2022, 06:53 PM IST
ఏం జరిగినా నాపేరు లాగుతారా.. వ్యక్తిగత గొడవలతోనే కోటంరెడ్డిపై దాడి : అనిల్ కుమార్ యాదవ్

సారాంశం

తెలంగాణకు 30 లక్షల మంది వలస వచ్చి బతుకుతున్నారని అన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రభుత్వ యంత్రాంగం సమిష్టి కృషితోనే సామాజికాభివృద్ధి సాధ్యమన్నారు సీఎం. 

నెల్లూరు నగర టీడీపీ ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని కారుతో ఢీకొట్టిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా... దీనిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇది రాజకీయ కోణంలో జరిగిన దాడేనని ఆయన భార్య సైతం ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఈ దాడిని తనకు ముడిపెట్టడం దుర్మార్గమన్నారు. జిల్లాలో ఏం జరిగినా తనకు అంటగడుతున్నారని, టీడీపీ నేతలు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని అనిల్ మండిపడ్డారు. వ్యక్తిగత విభేదాల వల్లే శ్రీనివాసులు రెడ్డిపై ఈ దాడి జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. 

అంతకుముందు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై ఆయన భార్య సంధ్య స్పందించారు. ఇది రాజకీయ కోణంలో జరిగిన దాడి అని ఆరోపించారు. 30 ఏళ్ల నుంచి కార్యకర్తల కోసం, పార్టీ కోసం కష్టపడుతున్న శ్రీనివాసులు రెడ్డి ఏరోజు కూడా వెనకడుగు వేయలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మూడున్నరేళ్లుగా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. వాటికి ఏనాడూ శ్రీనివాసులు రెడ్డి భయపడలేదని అన్నారు. రాజకీయాల్లో ఇటువంటి కూడా జరుగుతాయా అనేది ఈ ప్రభుత్వ హయాంలోనే చూస్తున్నామని చెప్పారు. ఇటువంటి దాడులకు శ్రీనివాసులు రెడ్డి భయపడరని.. రెట్టింపు ఉత్సాహంతో ప్రజల కోసం పనిచేస్తారని తెలిపారు.

వెనక బలమైన సపోర్ట్ లేకుండా.. ఒక వ్యక్తి ఇంటికి వచ్చి ఇలా చేయడని అన్నారు. అతడి బ్యాగ్రౌండ్‌లో ఎవరూ లేకపోతే.. ఘటన జరిగిన వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి మర్డర్ చేయాలని చూస్తున్నారని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇక్కడ శ్రీనివాసులు రెడ్డి కిందపడి రక్తం కారుతుంటే ఎక్కడైనా మర్డర్ చేయడం జరుగుతుందా అని ప్రశ్నించారు. కొద్దిగా ఆలస్యమైనా నిజాలు అందరికి తెలుస్తాయని అన్నారు. పోలీసులు ఎంతవరకు విచారణ చేస్తారో తెలియదని.. తాము మాత్రం తమ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఈ దాడికి పాల్పడింది ఎవరనేది త్వరలోనే బయటపెడతామని తెలిపారు. 

ALso Read:నా భర్తపై దాడి వెనక రాజకీయ కోణం.. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి భార్య సంధ్య

ఇక, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని ఆయన ఇంటి ప్రాంగణంలోనే కారు ఢీకొట్టింది. కారులో ఉన్న వ్యక్తిని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడి స్నేహితులు రాజశేఖర్ రెడ్డిగా గుర్తించారు. ఈ ఘటనకు ముందు అక్కడ చిన్నపాటి వాగ్వాదం జరిగినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. టీడీపీ నేతలు చెబుతున్న వివరాల ప్రకారం.. కోటంరెడ్డి కుమారుడు ప్రజయ్‌ సేనారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి ఇద్దరూ స్నేహితులు. వారి మధ్య కొన్ని వివాదాలు ఉన్నాయి. 

ఈ క్రమంలో శనివారం రాత్రి రాజశేఖర్‌ రెడ్డి మద్యం మత్తులో కోటంరెడ్డి ఇంటికొచ్చాడు. అక్కడ ప్రజయ్‌సేనా రెడ్డితో గొడవకు దిగాడు. ఇంట్లోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వారిద్దరినీ కోటంరెడ్డి వారించారు. ఇంటికి వచ్చి గొడవ చేయడమేమిటని ప్రశ్నించారు. కోటంరెడ్డి, ప్రజయ్‌, మరోవ్యక్తి కలిసి రాజశేఖర్‌రెడ్డిని ఇంటి నుంచి బయటికి పంపించారు. తర్వాత శ్రీనివాసులు రెడ్డి ఇంట్లోకి వస్తున్న సమయంలోనే..  రాజశేఖర్‌ రెడ్డి కారులో కూర్చుని రివర్స్‌ తీసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్టుగా కనిపించాడు. అయితే ఒక్కసారిగా కారును ముందుకు రానిచ్చి.. శ్రీనివాసులు రెడ్డిని ఢీకొట్టాడు. 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu