రాజకీయాల్లోకి మాజీ జెడీ లక్ష్మినారాయణ: ఏ పార్టీలోకి?

By pratap reddyFirst Published Oct 6, 2018, 12:58 PM IST
Highlights

రైతు ఇబ్బందులు, గ్రామీణుల సమస్యలపై అధ్యయనం కోసం పర్యటించానని తెలిపారు. రాష్ట్రంలో రైతు సమస్యలు పరిష్కరించడం అత్యంత ముఖ్యమని ఆయన అన్నారు. రాబోయే ఏడేళ్లు దేశానికి కీలకమని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. 

తిరుపతి: సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జెడి) లక్ష్మీనారాయణ త్వరలో రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే శనివారం స్వయంగా చెప్పారు. అయితే తాను ఏ పార్టీలో చేరేదీ చెప్పలేదు. పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి 13 జిల్లాల్లో పర్యటించానని ఆయన చెప్పారు. 

రైతు ఇబ్బందులు, గ్రామీణుల సమస్యలపై అధ్యయనం కోసం పర్యటించానని తెలిపారు. రాష్ట్రంలో రైతు సమస్యలు పరిష్కరించడం అత్యంత ముఖ్యమని ఆయన అన్నారు. రాబోయే ఏడేళ్లు దేశానికి కీలకమని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. 
గ్రామీణ ప్రాంతాలు కళావిహీనం అవుతున్నాయని, ధరల స్థిరీకరణ నిధి కావాలని రైతులు కోరుతున్నారని చెప్పారు. మత్స్యకారుల కోసం ప్రత్యేక విధానం తయారు చేస్తామని ఆయన చెప్పారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు తాను చేసిన పర్యటనలో ఎన్నో సమస్యలు గుర్తించాని ఆయన అన్నారు.

click me!