చంద్రబాబు కేబినెట్ భేటీపై మాజీ సీఎస్ ఫైర్

By Nagaraju penumalaFirst Published May 7, 2019, 7:47 PM IST
Highlights

ఎన్నికల కోడ్ న్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. నిబంధనల ప్రకారం ప్రకారం ఏం చేసినా అధికారులకు ఇబ్బంది ఉండదని ఆయన తెలిపారు. కేబినెట్ సమావేశానికి సంబంధించిన అజెండా ఏమిటో.. ఎందుకు నిర్వహిస్తున్నారో ఎన్నికల సంఘానికి తెలియజేసి చంద్రబాబు అనుమతి తీసుకోవాలని ఐవైఆర్‌ సూచించారు. 

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ భేటీ నిర్వహణపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమేనని అభిప్రాయపడ్డారు. 

ఎన్నికల కోడ్ న్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. నిబంధనల ప్రకారం ప్రకారం ఏం చేసినా అధికారులకు ఇబ్బంది ఉండదని ఆయన తెలిపారు. 

కేబినెట్ సమావేశానికి సంబంధించిన అజెండా ఏమిటో.. ఎందుకు నిర్వహిస్తున్నారో ఎన్నికల సంఘానికి తెలియజేసి చంద్రబాబు అనుమతి తీసుకోవాలని ఐవైఆర్‌ సూచించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో చంద్రబాబు ఏపీ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. 

పోలవరం ప్రాజెక్టు పనులు చూస్తుంటే మరో ఐదేళ్లయినా ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఎన్నికల ముందు వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తయిందని వాదించిన చంద్రబాబు ఇప్పుడు వచ్చే ఏడాదికి నీరందిస్తామని చెప్తున్నారంటూ ఐవైఆర్ మండిపడ్డారు. 

click me!