బీజేపీపై పోరాటానికి కలిసొస్తామంటే వెల్ కమ్: కేసీఆర్ పై చంద్రబాబు

Published : May 07, 2019, 06:46 PM IST
బీజేపీపై పోరాటానికి కలిసొస్తామంటే వెల్ కమ్: కేసీఆర్ పై చంద్రబాబు

సారాంశం

తాము బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని తమ పోరాటానికి ఏ పార్టీ మద్దతు ఇచ్చినా తాము స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల పర్యటన నేపథ్యంలో మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు.

ఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తాము బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని తమ పోరాటానికి ఏ పార్టీ మద్దతు ఇచ్చినా తాము స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల పర్యటన నేపథ్యంలో మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. తొలుత ఈ అంశంపై మాట్లాడే సమయం కాదన్న చంద్రబాబు అనంతరం తాము బీజేపీపై పోరాటం చేస్తున్నామని తమతో  కలిసి పోరాటం చేసేందుకు ఏ పార్టీ కలిసి వచ్చినా స్వాగతిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.  

ఇకపోతే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా తెలంగాణ సీఎం వివిధ రాష్ట్రాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా కేరళ సీఎం పినరయి విజయన్ ను కలిసిన విషయం తెలిసిందే. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu