జగన్ బెయిల్‌ రద్దుపై వెల్లువెత్తుతున్న డిమాండ్లు: లిస్ట్‌లోకి చింతా మోహన్

By Siva KodatiFirst Published Apr 29, 2021, 3:32 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ ఇటీవల డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం జగన్‌కు నోటీసులు పంపింది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్‌ సైతం జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. సీఎం తన బెయిల్‌ షరతులను ఉల్లంఘించారని చింతా మోహన్ ఆరోపించారు.

గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన అక్రమాస్తుల కేసులో తన సహ నిందితులైన అధికారులకు జగన్ పోస్టింగ్‌ ఇచ్చి కీలక పదవులు కట్టబెట్టారని ఆయన మండిపడ్డారు. సాక్షులను జగన్‌ ప్రభావితం చేస్తున్నారని చింతా మోహన్ ఆరోపించారు.

Also Read:బ్రేకింగ్: బెయిల్ రద్దు పిటిషన్... జగన్ కు సిబిఐ కోర్టు నోటీసులు

రూ.లక్ష లంచం కేసులో బంగారు లక్ష్మణ్‌ను జైలుకు పంపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటప్పుడు జగన్‌పై రూ.వందల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయని చింతా మోహన్ వెల్లడించారు. 

తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేసేందుకు బయటి నుంచి జనాలు వచ్చారని ఆయన తెలిపారు. అలా వచ్చిన వారి వల్లే నగరంలో కేసులు పెరిగాయని చింతా మోహన్ పేర్కొన్నారు. ఎన్నికల పోలింగ్‌‌కి, ఫలితానికి మధ్య ఇన్ని రోజుల వ్యత్యాసమెందుకు? అని ఆయన ప్రశ్నించారు.  

click me!