మండపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

Published : Jun 04, 2024, 07:34 AM ISTUpdated : Jun 05, 2024, 05:21 PM IST
మండపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

సారాంశం

 Mandapeta assembly elections result 2024: తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ గా వున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండపేట ఒకటి. గత పదిహేనేళ్లుగా మండపేట ఎమ్మెల్యేగా  వి.జోగేశ్వరరావు కొనసాగుతున్నారు. మండపేట  అసెంబ్లీ ఏర్పాటుతర్వాత 2009 లో మొదటిసారి ఎన్నికలు జరగ్గా టిడిపి విజయం సాధించింది.

Mandapeta assembly elections result 2024: తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ గా వున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండపేట ఒకటి. గత పదిహేనేళ్లుగా మండపేట ఎమ్మెల్యేగా  వి.జోగేశ్వరరావు కొనసాగుతున్నారు. మండపేట  అసెంబ్లీ ఏర్పాటుతర్వాత 2009 లో మొదటిసారి ఎన్నికలు జరగ్గా టిడిపి విజయం సాధించింది.  ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కూడా టిడిపి గెలిచింది. 2019 లో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి హవా కొనసాగినా మండపేటలో మాత్రం టిడిపి విజయంసాధించి హ్యాట్రిక్ కొట్టింది. మండపేటలో టిడిపి బలంగా వుండటంతో ఈసారి బలమైన నేత తోట త్రిమూర్తులును బరిలోకి దించింది వైసిపి.  

మండపేట నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. రాయవరం 
2. మండపేట 
3. కపిలేశ్వరపురం

మండపేట నియోజకవర్గ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌-  2,14,301 

పురుషులు -  1,04,913

మహిళలు ‌- 1,09,473

మండపేట అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

మండపేటలో వైసిపికి ఇప్పటివరకు గెలుపన్నదే లేదు. దీంతో ఈసారి ఎలాగైన గెలిచితీరాలని భావిస్తున్న ఆ పార్టీ అదిష్టానం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును బరిలోకి దింపింది. 

టిడిపి అభ్యర్థి :

సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వి. జోగేశ్వరరావునే మరోసారి బరిలోకి దించింది. వరుసగా మూడుసార్లు మండపేటలో విజయం సాధించిన జోగేశ్వరరావు నాలుగోసారి పోటీలో నిలిచారు. 

మండపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

మండపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. వైఎస్సార్‌సీపీకి చెందిన తోట త్రిమూర్తులు పై టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు 44435 ఓట్ల తేడాతో గెలుపొందారు.
 

మండపేట అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -  1,80,631 (96 శాతం)

టిడిపి - వేగుళ్ళ జోగేశ్వరరావు - 78,029 (41 శాతం) - 10,600 ఓట్ల మెజారిటీతో విజయం

వైసిపి - పిల్లి సుభాష్ చంద్రబోస్ - 67,429 (36 శాతం) - ఓటమి 

జనసేన పార్టీ - లీలా కృష్ణ ‌- 35,173 (18 శాతం)

మండపేట అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -   1,71,609 (87 శాతం)

టిడిపి - వి జోగేశ్వరరావు - 68,104 (43 శాతం)  ‌- 17,440 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - జివి స్వామినాయుడు - 64,099 (37 శాతం) - ఓటమి 
 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!