విజయవాడలో ఇటీవల ఓ బహిరంగ స్థలంలో రెండు గ్రూవుల మధ్య జరిగిన కొట్లాట కేసులో తాజాగా మరో 11 మంది నిందితుల అరెస్ట్ చేసినట్లు విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కార్యాలయం ప్రకటించింది.
విజయవాడలో ఇటీవల ఓ బహిరంగ స్థలంలో రెండు గ్రూవుల మధ్య జరిగిన కొట్లాట కేసులో తాజాగా మరో 11 మంది నిందితుల అరెస్ట్ చేసినట్లు విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కార్యాలయం ప్రకటించింది. మే 30తేదీన సాయంత్రం సుమారు 04.30 గంటల ప్రాంతంలో పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని తోటవారి వీధిలో గల బహిరంగ స్థలంలో
రెండు గ్రూపులు మారణాయుధాలతో దాడులు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ ఘర్షణకు సంబందించి సందీప్ మరియు పండు వర్గాల మీద రెండు కేసులు సమోదు చేసి దర్యాప్తుచేయడం జరిగిందన్నారు.
ఈ ఘర్షణలో సందీప్ అనే వ్యక్తి మృతిచెందగా అతడి హత్య కేసులో ఇదివరకే 13 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపడం జరిగిందన్నారు. ఈ కేసులకు సంబందించిదర్యాప్తు మరింత ముమ్మరం చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇవాళ(సోమవారం) సందీప్ వర్గానికి సంబందించి 11 మంది నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని కమీషరేట్ కార్యాలయం ప్రకటించింది.
అరెస్టయిన నిందితుల వివరాలు:
1) తోట జగదీష్ అలియాస్ బాలు(28), చిన్నగుడి, పెనమలూరు, విజయవాడ.(వైష్ణవి స్టీల్స్, పోరంకి)
2) మేకతోటి కిరణ్ కుమార్(29), మంగళగిరి, గుంటూరు.(రౌడీ షీటర్, మంగళగిరి టౌన్ - షీట్ నెం : 819సి/2015)
3) ఆకురాతి వెంకట శివరఘునాద్(29), మంగళగిరి, గుంటూరు.(రౌడీ షీటర్, మంగళగిరి టౌన్ - షీట్ నెం : 825ఎ/2016)
4) పంది విజయ ప్రసాద్(32), య(ర్రబాలెం, మంగళగిరి, గుంటూరు.(మంగళగిరిలో పెయింటింగ్ పని చేస్తాడు)
5) యర్రంశెట్టి రాము అలియాస్ నతానియేల్(21), రెల్లీస్ కాలనీ, పటమట, విజయవాడ.(తోట జగదీష్ ఐరన్ షాపులో హెల్పర్‌గా చేస్తున్నాడు)
6) కందెల శివరామ కృష్ణ అలియాస్ బుఢ్దా(25), శ్రీహరి గార్దెన్స్, పెనమలూరు.(ఎం.బి.ఎ చదివి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు.)
7) బోడా శివ(27), లంబాడీపేట, యనమలకుదురు, పెనమలూరు, విజయవాడ(బిటెక్ చదివి ఖాళీగా ఉన్నాడు.)
8) కన్నా సునీల్(30), శ్రీనివాసనగర్ కట్ట, తాడిగడప, పెనమలూరు, విజయవాడ.(విజయవాడ ఆటోనగర్‌లో వెల్డింగ్ వర్క్ చేస్తున్నాడు)
9) చింతా సాంబశివరావు(30), చిన్నవంతెన సెంటర్, పటమట, విజయవాడ.(ఆటోనగర్‌లో లారీ బాడీ వర్క్, చేస్తున్నాడు.)
10) చందా రామ్ నితిన్(24), పటమట, విజయవాడ.( సౌదత్రీ రియల్ ఎస్టేట్ బ్రోకర్, హైదరాబాద్ )
11) జక్కా రత్న సాయి అలియాస్ సాయి(24), ఆర్. ఆర్. గార్దెన్స్, పటమట, విజయవాడ.( ఆశోక లైల్యాండ్ లో సెల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తాడు)
read more బెదిరించాలనే వెళ్తే.. చంపుకునేంత వరకు వెళ్లింది: బెజవాడ గ్యాంగ్‌వార్‌కు కారణం ఆ ‘‘ ఒక్కడే ’’
విచారణలో గతంలో చెప్పబడిన విధంగా ధనేకుల శ్రీధర్,ప్రదీప్ రెడ్డికి యనమలకుదురులోని గ్రూప్ హౌస్‌కు సంబంధించిన వివాదంలో సందీప్ మరియు పండు మధ్య వ్యక్తిగత పోరు మొదలై పరస్పర దూషణలకు పాల్పడటం జరిగింది. అది కాస్తకొట్లాటకి దారి తీసింది. తరువాత సందీప్ అనుచరులతో పండు ఇంటి మీదకి వెళ్ళటం, మరుసటి రోజు పండు అనుచరులతో సందీప్ షాపు మీదకు వెళ్ళడంతో అది కాస్తా ఇరు వర్గాలు ఒకరి పై ఒకరు మారణాయుధాలతో దాడి చేసుకోవడం జరిగింది. ఈ దాడులలో గాయపడిన సందీప్ చనిపోవడం జరిగింది. పండుకు గాయాలు కలిగి చికిత్స పొందుతున్నాడు.
రాబట్టిన సమాచారం మేరకు సందీప్ వర్గానికి చెందిన 11 మందిని పండుపై జరిగిన హత్యాయత్నం కేసులో అదుపులోకి తీసుకొని వారి నుండి నేరానికి ఉపయోగించిన
మారణాయుధాలను మరియు వాహనాలను స్వాధీన పరుచుకోవడం జరిగిందని కమీషనరేట్ కార్యాలయం పేర్కొంది.
నిందితుల నుండి స్వాధీన పరచుకున్న వస్తువులు:
1) పట్టా కత్తులు -2,
2) నేపాల్ కత్తి - 1,
3) కర్ర-1,
4) రాడ్డు-2,
5) బ్లేడులు-06,
6) మోటారు సైకిళ్ళు-06.
ఈ కేసులో మరికొంత మందిని అదుపులోకి తీసుకోవలసి ఉందని వీరిని వివిధ రకాల ఎనాలసిస్‌లు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీలైనంత త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. విజయవాడ నగరంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఇలాంటి అసాంఘిక,వ్యతిరేక శక్తులు, నేరస్థులపై ఉక్కుపాదం మోపి, నేర రహిత మరియు శాంతియుత వాతావరణంలో జీవించేందుకు వివిధ చర్యలను తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కేసులో ఉన్నటువంటి నిందితులందరిపై రౌడీ షీట్స్ తెరవడం జరుగుతుందని...రౌడీ గ్యాంగ్‌లు వారి వారి కార్యకలాపాలు అన్నీ ఆపివేసి ప్రశాంత జీవనం సాగించాలని ఎటువంటి గొడవలకు అవకాశం కల్పించకూడదని, లేని యెడల కఠినమైన చర్యలు తీసుకుంటామని విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కార్యాలయం హెచ్చరించింది.