కోరాపుట్ లో ఎన్ కౌంటర్: అరకు ఎమ్మెల్యే కిడారి హత్య కేసులో నిందితురాలు హతం

By Nagaraju penumalaFirst Published May 8, 2019, 9:04 PM IST
Highlights

బుధవారం కిటుబకంటి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు.  వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. చనిపోయిన ఇద్దరు మహిళా మావోయిస్టులలో స్వరూప ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకేసులో కీలక నిందితురాలు స్వరూప ఎన్ కౌంటర్లో హతమైనట్లు తెలుస్తోంది. ఒడిషా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా పాడువా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆమె మృతిచెందినట్లు తెలుస్తోంది. 

బుధవారం కిటుబకంటి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు.  వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. 

చనిపోయిన ఇద్దరు మహిళా మావోయిస్టులలో స్వరూప ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుల దగ్గర నుంచి 3ఎస్‌ఎస్‌ఆర్‌, 2 ఇన్సాస్‌ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే గతేడాది సెప్టెంబర్‌లో కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలు ఓ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా మావోలు అడ్డగించారు. ఇద్దరిపై కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు. ఆ హత్య కేసులో స్వరూప కీలక నిందితురాలుగా ఉన్నారు. 

click me!