ఊహాల్లో తేలుతున్న వైసీపీ నేతలు: కాబోయే మంత్రి అంటూ హల్ చల్

Published : May 08, 2019, 06:24 PM IST
ఊహాల్లో తేలుతున్న వైసీపీ నేతలు: కాబోయే మంత్రి అంటూ హల్ చల్

సారాంశం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, సామినేని ఉదయభాను గెలుపు కచ్చితం అంటూ తెగ సంబంరపడిపోతున్నారట. అక్కడితో ఆగిపోలేదు కాబోయే మంత్రి వర్యులంటూ బ్యానర్లు, ఫ్లెక్సీలతో హల్ చల్ చేస్తున్నార.   

విజయవాడ: ఆలు లేదు చూలూ లేదు అల్లుడు పేరు సోమలింగం అన్న చందంగా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఎన్నికల ఫలితాలకు 15 రోజులు సమయం ఉన్నా వైసీపీ నేతలు మాత్రం తమదే అధికారం అంటూ ఊహల్లో విహరిస్తున్నారు. 

ఈసారి అధికారం తమదేనంటూ ధీమాగా ఉంటున్నారు. అంతేకాదు జిల్లాల వారీగా మంత్రి పదవులను సైతం పంచేసుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయభాను అనుచరులు మాత్రం మాంచి జోష్ లో ఉన్నారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, సామినేని ఉదయభాను గెలుపు కచ్చితం అంటూ తెగ సంబంరపడిపోతున్నారట. అక్కడితో ఆగిపోలేదు కాబోయే మంత్రి వర్యులంటూ బ్యానర్లు, ఫ్లెక్సీలతో హల్ చల్ చేస్తున్నార. 

ఎండలు మండిపోతుండటంతో జగ్గయ్యపేట పట్టణ మున్సిపల్ ఛైర్మన్ రాజగోపాల్ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఆ బాటిల్‌పై కాబోయే మంత్రి ఉదయభాను అంటూ స్టిక్కర్లు అంటించి మరీ పంపిణీ చేశారు. 

ఎన్నికల ఫలితాలు రాలేదు, జగన్ ముఖ్యమంత్రి కాలేదు, ఉదయభాను గెలుస్తాడా లేదా అనేది కూడా తెలియదు కానీ అప్పుడే కాబోయే మంత్రి అంటూ స్టిక్కర్లా అంటూ గుసగుసలాడుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...
Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu