పక్కా ప్లాన్ ప్రకారమే అమలాపురం అల్లర్లు.. వాట్సాప్‌లో డిస్కషన్, అరెస్ట్‌లయ్యాకే ఇంటర్నెట్ సేవలు : డీఐజీ

Siva Kodati |  
Published : May 27, 2022, 04:04 PM IST
పక్కా ప్లాన్ ప్రకారమే అమలాపురం అల్లర్లు.. వాట్సాప్‌లో డిస్కషన్, అరెస్ట్‌లయ్యాకే ఇంటర్నెట్ సేవలు : డీఐజీ

సారాంశం

కోనసీమ అల్లర్లకు సంబంధించి ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ ఘటన జరిగిందని.. అల్లర్లు ఎలా చేయాలో ముందుగానే వాట్సాప్‌లో డిస్కషన్ చేసుకున్నారని ఆయన చెప్పారు. అరెస్ట్‌లు ముగిశాకే జిల్లాలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరిస్తామని డీఐజీ చెప్పారు. 

అమలాపురం ఘటన పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందన్నారు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు. ఘటనపై ముందస్తుగానే వాట్సాప్‌లో చర్చించుకున్నారని ఆయన పేర్కొన్నారు. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఏమేం చేయాలో చర్చించుకున్నారని డీఐజీ వెల్లడించారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లను కూడా అరెస్ట్ చేస్తున్నామని పాలరాజు చెప్పారు. ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేశామని.. సాయంత్రానికి మరిన్ని అరెస్ట్‌లు వుంటాయని డీఐజీ వెల్లడించారు. 

అమ‌లాపురం అల్ల‌ర్ల‌కు రౌడీ షీట‌ర్లే కార‌ణ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అల్ల‌ర్ల‌లో పాలుపంచుకున్న మ‌రికొంద‌రిని గుర్తించామ‌ని, శుక్ర‌వారం మ‌రికొంద‌రిని అరెస్ట్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అనుమానితుల అరెస్టులు పూర్త‌య్యే దాకా జిల్లాలో ఇంటర్నెట్ సేవ‌ల నిలుపుద‌ల‌ను కొన‌సాగిస్తామ‌ని డీఐజీ వెల్లడించారు. అరెస్టులు ముగిశాక ద‌శ‌ల‌వారీగా ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను పున‌రుద్ధ‌రిస్తామ‌ని పాల‌రాజు స్పష్టం చేశారు.

ALso Read:కోనసీమ అల్లర్లు : 46 మందిపై ఎఫ్ఐఆర్.. లిస్టులో బీజేపీ నేతలు, కాపు ఉద్యమ నేత కుమారుడు

కాగా.. కోనసీమ జిల్లాకు (konaseema violence) అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ అమలాపురంలో (amalapuram violence) మంగళవారం జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలకు సంబంధించి ఆందోళనకారులను అరెస్ట్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసిన 46 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, బీజేపీ నేత రాంబాబులపై కేసు పెట్టారు.

కాపు ఉద్యమనేత నల్లా సూర్య చంద్రరావు కుమారుడు అజయ్ సహా 43 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు ఉద్రిక్తతల నేపథ్యంలో అమలాపురంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరికొందరిపై కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు పోలీసులు. సామర్లకోటకు చెందిన వాసంశెట్టి సుబ్రమణ్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. వజ్ర పోలీస్ వాహనం డ్రైవర్‌గా పని  చేస్తున్నారు  సుబ్రమణ్యం. 

మరోవైపు.. Amalapuram లో విధ్వంసం జరుగుతుందని ఊహించలేదని ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి Taneti Vanita చెప్పారు. కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆందోళనకారులు ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగారన్నారు. గురువారం నాడు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ హోం మంత్రి తానేటి వనిత ఓ తెలుగు న్యూస్ చానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్దంగా కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తామంటే ఎందుకు అడ్డుకోవాలన్నారు. అందుకే జేఏసీ నేతలను కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారని కూడా హోం మంత్రి గుర్తు చేశారు. 

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ Konaseema జిల్లా పెట్టాలని ఆందోళనలు సాగిన సమయంలో TDP, Jana Sena నేతలు ఈ ఆందోళనలకు మద్దతు పలికారా లేదా అని మంత్రి వనిత ప్రశ్నించారు. ఈ విషయమై ధర్నాలు,  నిరహార దీక్షలు ఎవరూ చేశారో కూడా అందరికీ తెలుసునన్నారు.  కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చిన తర్వాత పార్టీలు మాట మార్చాయని ఆమె విమర్శించారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్