ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు ప్రారంభం

By narsimha lodeFirst Published Jul 25, 2021, 10:02 AM IST
Highlights

ఏలూరు కార్పోరేషన్  ఓట్ల లెక్కింపు ఆదివావారం నాడు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో  ఇవాళ ఓట్ల లెక్కింపును సీఆర్ రెడ్డి కాలేజీలోని నాలుగు కేంద్రాల్లో ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఈ ఏడాది మార్చి 10వ తేదీన ఏలూరు కార్పోరేషన్ కు ఎన్నికలు జరిగాయి.
 

ఏలూరు: పశ్చిమగోదావరి  జిల్లా ఏలూరు కార్పోరేషన్  ఓట్ల లెక్కింపు ఆదివారం నాడు ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపునకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది మార్చి 10వ తేదీన ఏలూరు కార్పోరేషన్ ఎన్నికలు జరిగాయి. అయితే ఓట్ల లెక్కింపును మాత్రం నిలిపివేయాలని  హైకోర్టు ఆదేశించింది.

also read:హైకోర్టు గ్రీన్‌సిగ్నల్: ఏలూరు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపునకు అనుమతి

హైకోర్టు ఆదేశాల మేరకు  ఏలూరు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. అయితే  ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇవాళ ఓట్ల లెక్కింపును ఎస్ఈసీ చేపట్టింది.  సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలోని నాలుగు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఒక్కో డివిజన్ కు ఒక్కో లెక్కింపు టేబుల్ ను కేటాయించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియోలో రికార్డు చేస్తున్నారు. 

ఓట్ల లెక్కింపు కోసం 250 మంద సిబ్బందిని నియమించారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించింది ప్రభుత్వం.ఏలూరు కార్పోరేషన్ లో మొత్తం 50 డివిజన్లున్నాయి. ఇందులో మూడు డివిజన్లను వైసీసీ ఏకగ్రీవంగా గెలుపొందింది.  ఇవాళ మధ్యాహ్నానికి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


 

click me!