చిత్తూరులో ఏనుగుల బీభత్సం, రైతులపై దాడి.. ఎకరాల కొద్ది పంట నాశనం

Siva Kodati |  
Published : Sep 18, 2022, 08:20 PM IST
చిత్తూరులో ఏనుగుల బీభత్సం, రైతులపై దాడి.. ఎకరాల కొద్ది పంట నాశనం

సారాంశం

చిత్తూరు జిల్లా కుప్పం మండలం గణేశ్‌పురం వద్ద ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగుల గుంపును అటవీ ప్రాంతం వైపు పంపే ప్రయత్నం చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో మరోసారి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. కుప్పం మండలం గణేశ్‌పురం వద్ద పొలాల్లోకి ప్రవేశించాయి. కొన్ని ఎకరాల మేర పంటను సర్వనాశనం చేశాయి. అంతటితో ఆగకుండా అక్కడ వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులపైకి దూసుకెళ్లాయి. ఏనుగుల దాడిలో రామలింగం అనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్ధితి విషమంగా వుండటంతో కుప్పం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగుల గుంపును అటవీ ప్రాంతం వైపు పంపే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

జగన్ ను అడ్డంగా ఇరికించిన సాయిరెడ్డి | Vijaysai Reddy On YS Jagan | Asianet News Telugu
Vizag Beach: గోవా దేనికి గురూ? వైజాగ్ తీరంలో ఈ టాప్ 5 బీచ్ రిసార్ట్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే