మౌలిక సదుపాయాల కల్పనకే ప్రభుత్వ పెద్దపీట - ఏపీ ఇండ‌స్ట్రీస్ మినిస్ట‌ర్ మేకపాటి గౌతమ్ రెడ్డి

Published : Jan 17, 2022, 04:45 PM IST
మౌలిక సదుపాయాల కల్పనకే ప్రభుత్వ పెద్దపీట - ఏపీ ఇండ‌స్ట్రీస్ మినిస్ట‌ర్ మేకపాటి గౌతమ్ రెడ్డి

సారాంశం

మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంద‌ని ఆ రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన ‘‘పీఎం గ‌తిశ‌క్తి ’’ కార్య‌క్ర‌మంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం (andra pradhesh)  పెద్ద పీట వేస్తోంద‌ని ఆ రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి ( ap Industries minister mekapati goutham reddy) అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ (central minister nithin gadkari) ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం ‘‘పీఎం గ‌తిశ‌క్తి ’’ (pm gathi shakthi)  కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మం వ‌ర్చువల్ గా సాగింది. ఇందులో ఏపీ నుంచి మంత్రి మేక‌పాటి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ (ap cm jagan) ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాలు వివ‌రించారు. పంచ‌సూత్రాలు అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు. అందులో భాగంగా పోర్టులను అత్యాధునికంగా తీర్చిదద్దడం, జలవాయుమార్గాలను మరింత అభివృద్ధి చేయడం వంటి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామ‌ని అన్నారు. ఫైబర్ కేబుల్ నెట్ వర్క్ (fiber cable network) సహకారంతో టెలికం (telicom) రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామ‌ని తెలిపారు. 

ఏపీలో విద్యుత్ పునరుత్పాదకతకు కోసం సరికొత్త పద్ధతులను అవలంభింస్తున్నామ‌ని అన్నారు. పోర్టుల‌ను (ports), ఉడాన్ స్కీమ్ (udaan scheem) ద్వారా ప్రాంతీయ వాయుమార్గాల లింక్ చేప‌డుతున్నామ‌ని వివ‌రించారు. భారతమాల ప్రాజెక్టు (bharath mala) కింద రోడ్ల‌ను లింక్ చేస్తూ సరకు రవాణా మార్గాలను విస్తరిస్తున్నామ‌ని అన్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల రవాణా ఖర్చును తగ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని వివ‌రించారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఫైబర్ నెట్ (fiber net)అందిచేందుకు ప్ర‌యత్నిస్తున్నామ‌ని చెప్పారు. 

మారిటైమ్ (moritime) సంపదను పెంచడంలో, పోర్టులకు మెరుగైన వ‌స‌తుల‌ను క‌ల్పించ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముందుంద‌ని తెలిపారు. ఎయిర్ పోర్టులకు వెళ్లేందుకు రోడ్లు, రైళ్ల మార్గాలను నిర్మిస్తున్నామ‌ని అన్నారు.  ప‌ద్దెనిమిది వేల కోట్ల‌తో ఏపీలోని భావనపాడు (bhavanapadu), మచిలీపట్నం (machilipatnam), రామాయపట్నం (rayapatnam)పోర్టులను, 9 ఫిషింగ్ హార్బర్లను (shipping harbrs) ప్ర‌భుత్వం నిర్మిస్తోంద‌ని అన్నారు. విశాఖ‌ప‌ట్టణం చెన్నై (vishakapatnam chennai), చెన్నై బెంగళూరు (chennai bangloor), బెంగళూరు హైదరాబాద్ (bangloor hyderbad)వంటి 3 పారిశ్రామిక కారిడార్లను (industrial caridars) ప్ర‌భుత్వం నిర్మిస్తోంద‌ని చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్రతి జిల్లాలో యువతకు పెద్ద సంఖ్య‌లో ఉద్యోగాలు క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని అన్నారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గ్రామ‌, వార్డు స్థాయిలో సెక్ర‌టేరియ‌ట్ (secratariats)ల‌ను నిర్మించి,  రాష్ట్ర ప్ర‌జ‌ల ఇంటి వ‌ద్దకే ప్ర‌భుత్వ సేవ‌లు చేరువేస్తున్నామ‌ని అన్నారు. ఇది సీఎం జ‌గ‌న్ ముందు చూపునకు నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. పీఎం మోడీ (prime minister) నాయ‌క‌త్వంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌పంచ దేశాలతో పోటీ ప‌డుతోంద‌ని మంత్రి అన్నారు. వ‌ర‌ల్డ్ బ్యాంక్ (world bank)2018లో ప్ర‌క‌టించిన ర్యాకింగ్ లో భార‌త్ ర్యాంక్ చాలా మెరుగ్గా ఉంద‌ని ప్ర‌శంసించారు. ఇది ప్ర‌ధాని మోడీ ప‌రిపాల‌న వ‌ల్లే సాధ్యం అయ్యింద‌ని అన్నారు. ప్ర‌పంచ దేశాల ఎగుమ‌తుల‌తో పోలిస్తే.. ఇండియా నుంచి ఎగుమ‌తుల స‌గ‌టు ఎక్కువ‌గా ఉంద‌ని కొనియాడారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియాచంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu