అనారోగ్యంగా ఉన్నాను, విచారణకు హాజరు కాలేను: సీఐడీకి రఘురామ లేఖ

Published : Jan 17, 2022, 04:37 PM IST
అనారోగ్యంగా ఉన్నాను, విచారణకు హాజరు కాలేను: సీఐడీకి రఘురామ లేఖ

సారాంశం

అనారోగ్యంగా ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని ఏపీ సీఐడీకి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు.  వాస్తవానికి ఇవాళ విచారణకు రఘురామకృష్ణం రాజు హాజరు కావాలి.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ Cid పోలీసులకు Ycp రెబెల్ ఎంపీ Raghurama krishnam Raju సోమవారం నాడు లేఖ రాశారు.  ఇవాళ విచారణకు తాను హాజరు కాలేనని ఆ లేఖలో తెలిపారు.అనారోగ్యం వల్ల  తాను ఇవాళ జరిగే విచారణకు హాజరుకాలేనని ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆ లేఖలో పేర్కొన్నారు. 

Delhi  వెళ్లిన  తర్వాత తాను అనారోగ్యానికి గురయ్యానని ఆletterలో రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.  తాను Probeకు హాజరయ్యేందుకు కనీసం నాలుగు వారాల సమయం ఇవ్వాలని  ఆ లేఖలో సీఐడీ పోలీసులను  రఘురామకృష్ణంరాజు కోరారు. 

ఈ నెల 12 వ తేదీన ఇవాళ విచారణకు హాజరు కావాలని ఏపీ సీఐడీ అధికారులు రఘురామకృష్ణంరాజుకు నోటీసు ఇచ్చారు.ఈ నోటీసులు తీసుకొన్న రఘురామకృష్ణంరాజు విచారణకు హాజరౌతానని చెప్పారు. కానీ అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేని ఆయన ప్రకటించారు.  

ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించేలా  మీడియాలో వ్యాఖ్యలు చేశారని  ఏపీ సీఐడీ అధికారులు 2021 మే 14న రఘురామకృష్ణంరాజును Hyderabad లోని గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు. ప్రభుత్వ  ప్రతిష్టకు భంగం కల్గించేలా వ్యవహరించారని 124-ఏ , Ipc  153 - బీసెక్షన్ కింద సీఐడీ కేసు నమోదుచేసింది. దీంతో పాటుగా ఐపీసీ సెక్షన్ 505 కింద బెదిరింపులకు పాల్పడటం, ఐపీసీ సెక్షన్ 120-B కింద దురుద్దేశపూర్వకంగా కుట్రకు పాల్పడ్డారనే అభియోగాల కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది.  ఈ కేసులో  ఆయనను సీఐడీ అరెస్ట్ చేసింది.

తనపై నమోదైన కేసుల విషయమై పలు కోర్టుల్లో రఘురామకృష్ణంరాజు పిటిషన్లు దాఖలు చేశారు. చివరకు ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.దీంతో 2021 మే 21న రఘురామకృష్ణంరాజుకు supreme court బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్‌ తీసుకోవచ్చని తెలిపింది. 

సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో విచారణకు సహకరించాలని కూడా bail సందర్భంగా కోర్టు సూచించింది. అయితే  ఈ కేసుల్లో విచారణకు హాజరు కావాలని కూడా ఎంపీ రఘురామకృష్ణం రాజుకు సీఐడీ అధికారులు సమాచారం పంపారు.  అయితే విచారణకు రఘురామకృష్ణంరాజు హాజరు కాలేదని సీఐడీ అధికారులు చెబుతున్నారు. దీంతో సీఐడీ అధికారులు రఘురామకృష్ణంరాజు ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు.

రఘురామకృష్ణం రాజు నోటీసులు తీసుకొన్నారు. విచారణకు వస్తానని చెప్పారు.అయితే గతంలో తనను అరెస్ట్ చేసిన  సమయంలో చిత్రహింసలకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రఘురామకృష్ణం రాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కోరింది. 

అయితే ఈ విషయమై లోక్‌సభ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో గత వారంలో తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి నర్సాపురంలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని కూడా రఘురామకృష్ణంరాజు సవాల్ విసిరారు. 
 

PREV
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu