కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక: వీడియో పుటేజీ హైకోర్టుకు సమర్పణ

By narsimha lode  |  First Published Nov 25, 2021, 10:40 AM IST

కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నికకు సంబంధించిన వీడియోను ఎన్నికల రిటర్నింగ్ అధికారి గురువారం నాడు కోర్టుకు సమర్పించారు. హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం నాడు ఈ మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు.


అమరావతి: కొండపల్లి మున్సిపల్ చైర్మెన్, వైఎస్ చైర్మెన్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వీడియోను ఎన్నికల రిటర్నింగ్ అధికారి గురువారం నాడు  ఏపీ హైకోర్టుకు సమర్పించారు. దీంతో ఇవాళ మున్సిపల్ చైర్మెన్ ఎన్నికను హైకోర్టు ప్రకటించే అవకాశం ఉంది.  అయితే విజయవాడ ఎంపీ కేశినేని నాని  ఎక్స్ అఫిషియో ఓటు వినియోగంపై కూడా కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.హైకోర్టు ఆదేశాల మేరకు కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నికను రిటర్నింగ్ అధికారులు బుధవారం నాడు నిర్వహించారు.

Ap High court ఆదేశాల మేరకుKondapalli municipal chairman ఎన్నికను రిటర్నింగ్ అధికారులు బుధవారం నాడు నిర్వహించారు.  సోమ, మంగళవారాల్లో మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక వాయిదా పడింది. ఎన్నికను  బుధవారం నాడు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ ఎంపీ kesineni Naniకి ఎక్స్ అఫిషియో ఓటుపై Ycp సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమ, మంగళవారాల్లో ఎన్నిక జరగకుండా వైసీపీ సభ్యులు అడ్డుకొన్నారని Tdp  ఆరోపించింది. ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా ఎన్నికల అధికారులు ఎన్నిక నిర్వహించకపోవడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ  పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు  బుధవారం నాడు ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియను వీడియో తీసి అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన  నివేదికను కూడా అధికారులు కోర్టుకు సమర్పించారు. 

Latest Videos

undefined

also read:కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఎలా జరిగిందంటే...: టిడిపి ఎంపీ, వైసిపి ఎమ్మెల్యే మాటల్లోనే (వీడియో)

కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 స్థానాలున్నాయి. టీడీపీకి 14, వైసీపీకి 14 స్థానాలు వచ్చాయి. ఒక్క స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్ధి లక్ష్మి విజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్ధి ఆ తర్వాత టీడీపీలో చేరారు.  దీంతో టీడీపీ బలం 15కి చేరింది. అయితే విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటును కొండపల్లి మున్సిపాలిటీలో వినియోగించుకొంటానని లేఖ రాశారు. ఈ విషయమై స్పందన రాకపోవడంతో ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడలో ఎంపీ కేశినేని నాని  ఎక్స్ అఫిషియో ఓటును నమోదు చేసుకొన్నారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. దీంతో కొండపల్లి మున్సిపాలిటీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎక్స్‌అఫిషియో ఓటు హక్కు నమోదు చేసుకోవడం సాధ్యం కాదని వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  కొండపల్లిలో తనకు ఎక్స్ అఫిషియో ఓటు హక్కు కల్పించాలని ఎంపీ కేశినేని నాని మున్సిపల్ కమిషనర్ కు లేఖ రాశాడు. అయితే ఈ లేఖపై మున్సిపల్ కమిషనర్ నుండి సమాధానం రాకపోవడంతో  కేశినేని నాని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మరో వైపు  కేశినేని ఎక్స్ అఫిషియో  ఓటు హక్కు విషయమై వైసీపీ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
రాష్ట్రంలోని 87 మున్పిపాలిటీలకు జరిగిన ఎణ్నికల్లో 84 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. గతంలో జరిగిన ఎన్నికల్లో తాడిపత్రిలో టీడీపీ విజయం సాధించింది. ఈ నెలలో  జరిగిన ఎన్నికల్లో  ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన స్థానంలో టీడీపీ గెలుపొందింది. కొండపల్లిలో  టీడీపీ మెజారిటీ స్థానాలను దక్కించుకొంది. 

 

click me!