ఏపీలో అర్ధరాత్రి 12 గం. వరకు పోలింగ్ .. రికార్డు స్థాయిలో ఓటింగ్..ఏ జిల్లాలో ఎంతంటే?

Published : May 14, 2024, 08:54 AM IST
ఏపీలో అర్ధరాత్రి 12 గం. వరకు పోలింగ్ .. రికార్డు స్థాయిలో ఓటింగ్..ఏ జిల్లాలో ఎంతంటే?

సారాంశం

AP Election: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్‌ జరిగింది. ఏపీలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. 

AP Election: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు సోమవారం నాడు పోలింగ్ జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాడానికి ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం ఆరు గంటల వరకు  క్యూలైన్లలో ఉన్నవారికి  ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇలా అర్ధరాత్రి 12 దాటినా కొన్ని చోట్ల పోలింగ్‌ జరిగింది. ఏపీ ఎన్నికల కమిషన్‌ అంచనాల ప్రకారం అర్ధరాత్రి 12 గంటల వరకు దాదాపుగా 78.36 శాతం పోలింగ్‌ నమోదు అయినట్టు వెల్లడించింది. 

 జిల్లాల వారీగా పోలింగ్‌ శాతం ఇలా 

అల్లూరి సీతారామరాజు        - 63.19 శాతం
అనకాపల్లి                        - 81.63 శాతం
అనంతపురం                    - 79.25 శాతం
అన్నమయ్య                       - 76.12 శాతం
బాపట్ల                             - 82.33 శాతం
చిత్తూరు                          - 82.65 శాతం
అంబేద్కర్ కోనసీమ             - 83.19 శాతం
తూర్పు గోదావరి               - 79.31 శాతం
ఏలూరు                          - 83.04 శాతం
గుంటూరు                       - 75.74 శాతం
కాకినాడ                        - 76.37 శాతం
కృష్ణా                             - 82.20 శాతం
కర్నూలు                         - 75.83 శాతం
నంద్యాల                        - 80.92 శాతం
ఎన్టీఆర్                           - 78.76 శాతం
పల్నాడు                         -78.70 శాతం
పార్వతీపురం మన్యం          - 75.24 శాతం
ప్రకాశం                           - 82.40 శాతం
పొట్టిశ్రీరాములు నెల్లూరు      - 78.10 శాతం
శ్రీ సత్యసాయి                   - 82.77 శాతం
శ్రీకాకుళం                       - 75.41 శాతం
తిరుపతి                          - 76.83 శాతం
విశాఖపట్నం                    - 65.50 శాతం
పశ్చిమ గోదావరి                -81.12 శాతం
వైఎస్సార్                        - 78.12 శాతం
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?