
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమరం ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు సోమవారం ఓటింగ్ జరిగింది. ఓటర్లు తమ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాడానికి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పలుచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 6 గంటల వరకూ 75 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
కాగా.. చిత్తూరులో అత్యధికంగా 74 శాతం పోలింగ్ నమోదు కాగా.. అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 55 శాతం ఓటింగ్ నమోదైంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూలైన్లలో ఓటు వేసేందుకు నిల్చున్నారు. గత ఎన్నికల్లో 79.08 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి ఎన్నికలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఈసీ అంచనా వేస్తోంది.
ఆ మూడు ప్రాంతాల్లో 4 గంటలకే ముగిసిన పోలింగ్
ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల లోపు క్యూ లైన్లలో వేచి ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం ఇస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ ముగిసింది. 6 గంటల లోపు క్యూ లైన్లలో వేచి ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం ఇచ్చారు. ఇక పూర్తి సమాచారం విడుదలయ్యే వరకు పోలింగ్ శాతం మరింత పెరుగుతుందని, ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏపీలో జిల్లా వారీగా పోలింగ్ నమోదు ఇలా.. ( 5 గంటల వరకు)
అల్లూరి సీతారామరాజు – 55.17
అనకాపల్లి – 65.97
అనంతపురం – 68.04
అన్నమయ్య – 67.63
బాపట్ల 72.14
చిత్తూరు – 74.06
అంబేద్కర్ కోనసీమ -73.55
ఈస్ట్ గోదావరి – 67.93
ఏలూరు – 71.10
గుంటూరు – 65.58
కాకినాడ – 65.01
కృష్ణ జిల్లా – 73.53
కర్నూలు – 64.55
నంద్యాల – 71.43
ఎన్టీఆర్ జిల్లా – 67.44
పల్నాడు – 69.10
పార్వతీపురం మన్యం – 61.18
ప్రకాశం – 71.00
నెల్లూరు – 69.95
సత్యసాయి జిల్లా – 67.16
శ్రీకాకుళం – 67.48
తిరుపతి – 65.88
విశాఖ – 57.42
విజయనగరం – 68.16
పశ్చిమ గోదావరి – 68.98
వైయస్ఆర్ జిల్లా – 72.85