ఏపీలో ముసాయిదా ఓటర్ల  జాబితా విడుదల.. అభ్యంతరాల స్వీకరణ ఎప్పటి వరకంటే..? 

Published : Oct 27, 2023, 10:59 PM IST
ఏపీలో ముసాయిదా ఓటర్ల  జాబితా విడుదల.. అభ్యంతరాల స్వీకరణ ఎప్పటి వరకంటే..? 

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లోని ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది ఎన్నికల సంఘం. మొత్తం ఓటర్లు 4,01,53,292 మంది ఉన్నారు. ఆ జాబితాలో పురుషులు, మహిళలు ఎంతమంది ఉన్నారంటే..

ఆంధ్రప్రదేశ్ లోని ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఆన్ లైన్ లో ఉంచినట్టు ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,02,21,450 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో మహిళా ఓటర్లు- 2,03,85,851 మంది, కాగా.. పురుష ఓటర్లు 1,98,31,791 మంది ,ట్రాన్స్ జెండర్లు- 3808 మంది, సర్వీసు ఓటర్లు 68,158 మంది  ఉన్నారు. 

కాగా.. అనంతపురం జిల్లాలో అత్యధికంగా  19,79,775 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,40,857 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. ఈ జాబితాపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న డిసెంబర్ 9 వరకు తెలియజేయాలని ఎన్నికల సంఘం తెలిపింది.  ఇంటింటి సర్వే పూర్తి చేసిన తరువాత జనవరి 5 న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది.  ముసాయిదా జాబితాను అన్ని జిల్లాల్లోని రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులకు ఎన్నికల సంఘం  సూచించింది. 2023 జనవరి 6 నుంచి 2023 ఆగస్టు 30వరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అలాగే.. తొలగించిన 21,18,940 మంది ఓట్లను పునఃపరిశీలిస్తామని తెలిపింది. ఆగస్టులో చేపట్టిన ఇంటింటి సర్వేలో జీరో డోర్ నెంబర్లతో 2,51,767 ఓట్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ గుర్తించింది. ఆగస్టులో చేపట్టిన ఇంటింటి సర్వేలో జీరో డోర్ నెంబర్లతో 2,51,767 ఓట్లు గుర్తించినట్టు స్పష్టం చేసింది.

  • మొత్తం ఓటర్లు- 4,01,53,292
  • పురుషులు- 1,98,31,791
  • మహిళలు - 2,03,85,851
  • ట్రాన్స్ జెండర్లు- 3,808
  • సర్వీస్ ఓటర్లు - 66,158
  • పోలింగ్ కేంద్రాలు- 46,165

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!