వేసేస్తామంటూ వార్నింగ్, అందరిదీ ఒకే సామాజిక వర్గం .. దాడి చేస్తే చేతులు కట్టుకుని కూర్చోం : అంబటి రాంబాబు

Siva Kodati |  
Published : Oct 27, 2023, 04:30 PM IST
వేసేస్తామంటూ వార్నింగ్, అందరిదీ ఒకే సామాజిక వర్గం  .. దాడి చేస్తే చేతులు కట్టుకుని కూర్చోం : అంబటి రాంబాబు

సారాంశం

ఖమ్మంలో తనపై దాడి చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు . హఠాత్తుగా పదిమంది వచ్చి వేసేస్తాంటూ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని మంత్రి  తెలిపారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వచ్చి దాడికి యత్నించారని రాంబాబు ఆరోపించారు. 

ఖమ్మంలో తనపై దాడి చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తే కొందరు టీడీపీ నేతలు దాడికి యత్నించారని తెలిపారు. ఖమ్మంలో అంబటి రాంబాబుకు నిరసన సెగ అంటూ ప్రచారం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. హఠాత్తుగా పదిమంది వచ్చి వేసేస్తాంటూ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని మంత్రి  తెలిపారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వచ్చి దాడికి యత్నించారని రాంబాబు ఆరోపించారు. 

కులోన్మాదులపై పోలీసులు కేసు నమోదు చేశారని.. ఒక మంత్రిగా సెక్యూరిటీ వున్న తనపైనే దాడి చేయాలని యత్నించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు మదంతో కొందరు ఉన్మాదులు పేట్రేగిపోతున్నారని.. వీరికి తోడు కొన్ని ఛానెళ్లు అంబటికి నిరసన సెగ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నాయని అంబటి రాంబాబు ఆరోపించారు. దాడులు చేస్తే చేతులు కట్టుకుని కూర్చోమని.. ఉన్మాదులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు ఎన్ని పిటిషన్లు వేసినా న్యాయస్థానాలు నిబంధనల మేరకు నడుచుకుంటాయని రాంబాబు పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Ambati Rambabu Energetic Dance: భోగి వేడుకల్లో డాన్స్ అదరగొట్టినఅంబటి రాంబాబు | Asianet News Telugu
AP Food Commission Serious: ఈ హాస్టల్ కంటే జైల్ బెటర్.. పిల్లలు ఏడుపే తక్కువ | Asianet News Telugu