అమరావతి భూముల కొనుగోలులో మనీ లాండరింగ్?: దర్యాప్తుకు ఈడీకి సీఐడీ లేఖ

By narsimha lode  |  First Published Feb 3, 2020, 10:55 AM IST

అమరావతి భూముల కొనుగోలు విషయంలో  మనీ లాండరింగ్ చోటు చేసుకొందని సీఐడీ అనుమానిస్తోంది.ఈ విషయంలో విచారణ చేయాలని సీఐడీ ఈడీకి లేఖ రాసింది. 


అమరావతి: అమరావతిలో రాజధాని  భూముల కొనుగోలులో మనీలాండరింగ్‌ చోటు చేసుకొన్నట్టుగా సీఐడీ అనుమానిస్తుంది.ఈ విషయమై దర్యాప్తు చేయాలని ఈడీకి సీఐడీ లేఖ రాసింది.

 అమరావతిలో  భూముల కొనుగోలు విషయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకొందని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. అమరావతి ప్రాంతంలో సుమారు నాలుగు వేల ఎకరాల భూములను టీడీపీకి చెందిన నేతలు వారి బంధువులు, సన్నిహితులు కొనుగోలు చేశారని అసెంబ్లీలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.

Latest Videos

undefined

Also read: సీఐడీ కేసు:796 తెల్ల రేషన్ కార్డుదారులకు అమరావతిలో భూములు

ఇప్పటికే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సీఎం జగన్‌కు నివేదిక అందించింది. ఈ నివేదిక ఆధారంగా సీఐడీ విచారణ చేపట్టింది.

అమరావతి ప్రాంతంలో సుమారు 790 మంది తెల్ల రేషన్ కార్డు దారులు భూములు కొనుగోలు చేసినట్టుగా సీఐడీ గుర్తించింది.తెల్ల రేషన్ కార్డు దారులు భూముల కొనుగోలుకు సంబంధించిన అంశంపై సీఐడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

టీడీపీకి చెందిన పలువురు నేతలు బినామీల పేర్లతో అమరావతిలో భూములను కొనుగోలు చేసినట్టుగా  వైసీపీ ఆరోపణలు చేసింది. ఈ విషయమై కేబినెట్ సబ్ కమిటీ నివేదికను కూడ వైసీపీ నేతలు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

భూముల  కొనుగోలులో  మనీ ల్యాండరింగ్ చోటు చేసుకొన్నట్టుగా సీఐడీ అభిప్రాయపడుతోంది.ఈ విషయమై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు వీలుగా సీఐడీ  అధికారులు ఈడీకి లేఖ రాశారు.

ఏపీకి చెందిన సీఐడీ అధికారులు రాసిన లేఖ ఈడీకి అందింది. మనీలాండరింగ్ కు సంబంధించి విచారణ చేయాలని సీఐడీ అధికారులు కోరిన నేపథ్యంలో ఈ భూముల కొనుగోలు విషయంలో ఈడీ రంగంలోకి దిగనుంది.

రెండు మూడు రోజల్లో ఈ విషయమై ఈడీ అధికారులు కేసు నమోదు చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.ఈ విషయమై ఇంకా స్ఫష్టత రావాల్సి ఉంది.

మరో వైపు 790 మంది తెల్ల రేషన్ కార్డు దారులు లక్షలాది రూపాయాల విలువైన భూమిని ఎలా కొనుగోలు చేశారనే విషయమై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ భూముల కొనుగోలు వెనుక మర్మం ఏమిటనే విషయమై సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
 

click me!