
ప్రజల నుంచి స్కీముల పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేసిన మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్ (Maithri Plantation And Horticulture) ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (enforcement directorate) అటాచ్ చేసింది. ఈ కేసులో నక్షత్ర బిల్డర్స్, మైత్రి రియాలిటీ, లక్కు మాధవరెడ్డి, లక్కు కొండారెడ్డి, లక్కు మల్యాద్రిరెడ్డి, కొలకపూడి బ్రహ్మారెడ్డి లకు చెందిన రూ.110 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మొత్తంగా ఏపీ, తెలంగాణలలో 210 ఆస్తులను అటాచ్ చేసింది. స్కీముల పేరుతో వీరు ప్రజల నుంచి రూ.288 కోట్లు వసూలు చేసినట్లుగా ఈడీ దర్యాప్తులో తేలింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.