రూ.1,500 కోట్ల స్కామ్.. సాఫ్ట్‌వేర్ ఎగుమతుల ముసుగులో విదేశాలకు డబ్బు

By Siva Kodati  |  First Published Mar 8, 2021, 3:35 PM IST

విదేశాలకు అక్రమంగా నిధుల తరలింపు కేసులో ఇద్దరిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసింది. సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల పేరిట రూ.1500 కోట్లు విదేశాలకు తరలించారనే ఆరోపణలపై దీపక్‌ అగర్వాల్‌, ఆయుష్‌ గోయల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు.

చైనా, సింగపూర్‌, హాంకాంగ్‌కు నిధులు మళ్లించినట్లు వీరిపై ఆరోపణలున్నాయి. విశాఖ కోర్టు అనుమతితో దీపక్‌ అగర్వాల్‌ను ఈడీ మూడురోజుల కస్టడీకి తీసుకోగా, మరో నిందితుడు ఆయుష్‌ అగర్వాల్‌ను కూడా కస్టడీకి అప్పగించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరింది. 

Latest Videos

ఆదాయపు పన్ను శాఖ ఫిర్యాదుతో వడ్డీ మహేశ్‌పై గతంలో కేసు నమోదు చేశారు. ప్రమోద్ అగర్వాల్, ఆయుష్ గోయల్, వికాస్ గుప్తా, వినీత్ గోయెంకాకు సంబంధించిన నిధులను వడ్డీ మహేశ్ విదేశాలకు మళ్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అలాగే ప్రధాన సూత్రధారి వీకే గోయల్‌ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. డొల్ల కంపెనీలు సృష్టించి విదేశాలకు వడ్డీ మహేశ్ నిధులు మళ్లించినట్లు తేల్చారు. 
 
click me!