జేసీ దివాకర్ రెడ్డికి షాకిచ్చిన ఈసీ: కేసు నమోదు

Published : May 03, 2019, 12:37 PM IST
జేసీ దివాకర్ రెడ్డికి షాకిచ్చిన ఈసీ: కేసు నమోదు

సారాంశం

అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల్లో గెలవాలంటే రూ. 50 కోట్లు ఖర్చు పెట్టాలని జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదులు చేశారు.

అమరావతి: అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల్లో గెలవాలంటే రూ. 50 కోట్లు ఖర్చు పెట్టాలని జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదులు చేశారు.

ఎన్నికల్లో  కనీసం రూ. 50 కోట్లను ఖర్చు పెట్టారని  జేసీ  చేసిన వ్యాఖ్యలపై  చర్యలు తీసుకోవాలని వైసీపీ, సీపీఐలు ఈసీకి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదులపై ఈసీ స్పందించింది. 

జేసీ కామెంట్స్‌పై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. జిల్లా యంత్రాంగం నుండి వచ్చిన  నివేదిక ఆధారంగా జేసీ దివాకర్ రెడ్డిపై  ఈసీ కేసు నమోదు చేసింది.

గత నెలలో అమరావతిలో చంద్రబాబునాయుడు సమీక్ష సమావేశానికి హాజరైన సమయంలో   మీడియా ప్రతినిధులతో  మాట్లాడే సమయంలో   జేసీ దివాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా  ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

 

 

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP