ఏసీబీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు

By Nagaraju penumalaFirst Published Apr 22, 2019, 4:44 PM IST
Highlights

 ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తక్షణమే ఆయన బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించింది. ఇకపోతే 1989 సంవత్సరానికి చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. ఎన్నికలకు మందు వరకు ఇంటెలిజెన్స్ డీజీగా ఆయన విధులు నిర్వహించారు. 

అమరావతి: ఎన్నికలకు ముందు ఈసీవేటుకు గురైన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు కీలక శాఖ కేటాయించింది ఏపీ ప్రభుత్వం.  ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 

తక్షణమే ఆయన బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించింది. ఇకపోతే 1989 సంవత్సరానికి చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. ఎన్నికలకు మందు వరకు ఇంటెలిజెన్స్ డీజీగా ఆయన విధులు నిర్వహించారు. 

అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసింది. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. తాజాగా ఆయనను ఏసీబీ డీజీగా నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. 
 

click me!