తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు .. రేపే పోలింగ్‌, సర్వం సిద్ధం చేసిన ఈసీ

Siva Kodati |  
Published : Mar 12, 2023, 09:29 PM ISTUpdated : Mar 12, 2023, 09:33 PM IST
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు .. రేపే పోలింగ్‌, సర్వం సిద్ధం చేసిన ఈసీ

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో టీచర్, గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసింది ఎన్నికల కమీషన్.  సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది.  

తెలుగు రాష్ట్రాల్లో టీచర్, గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసింది ఎన్నికల కమీషన్. ఏపీ విషయానికి వస్తే.. 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి వుంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల విషయానికి వస్తే ఆరు జిల్లాల్లో 331 పోలీంగ్ కేంద్రాల్లో .. 2 లక్షల 9 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ జిల్లాల్లో గ్రాడ్యుయేట్..  ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజున ఫలితాలను ప్రకటించనున్నారు. 

Also REad: టీచర్ , గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. బోగస్ ఓట్లపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ఇక తెలంగాణ విషయానికి వస్తే 1 టీచర్, 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 137 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మూడు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కుర్మ‌య్య‌గారి న‌వీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను ఖరారు చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి భారీ బలం ఉన్న నేపథ్యంలో వీరి ఎన్నిక లాంఛనం కానుంది. 

PREV
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం