కాంగ్రెస్‌ను వీడిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. ఖర్గేకు రాజీనామా లేఖ, త్వరలోనే బీజేపీలోకి..?

Siva Kodati |  
Published : Mar 12, 2023, 07:53 PM ISTUpdated : Mar 12, 2023, 08:17 PM IST
కాంగ్రెస్‌ను వీడిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. ఖర్గేకు రాజీనామా లేఖ, త్వరలోనే బీజేపీలోకి..?

సారాంశం

కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను ఏఐసీసీ అధ్యక్షుడికి పంపారు. 

కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడికి పంపారు. త్వరలో ఆయన బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నేతలతో కిరణ్ సంప్రదింపులు జరిపారు. కీలక పదవి ఇస్తామనే హామీతోనే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలోకి చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. 

కాంగ్రెస్‌తోనే రాజకీయ జీవితం ప్రారంభించిన కిరణ్ కుమార్ రెడ్డి.. పార్టీలో పలు పదవులు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభపతిగా కూడా పనిచేశారు. 2010 నవంబర్‌లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రిగా రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో.. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన కిరణ్ కుమార్  రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటు కూడా సొంతం చేసుకోలేదు. 

ALso REad: బీజేపీలోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి!.. కీలక బాధ్యతలు అప్పగించే చాన్స్..!

ఆ తర్వాత నాలుగేళ్ల పాటు సైలెంటుగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి.. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో కిరణ్ కుమార్ రెడ్డి అంతా యాక్టివ్‌గా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అయితే కొంనున్నారనే ప్రచారం సాగుతూనే ఉంది. బీజేపీ పెద్దలు  ఆయనతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం సాగింది. అయితే తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి.. బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం