వారు చెప్పారనే కిడ్నాప్ నాటకం.. శిరో ముండనం బాధితుడు ప్రసాద్..

By AN TeluguFirst Published Feb 6, 2021, 11:48 AM IST
Highlights

శిరో ముండనం బాధితుడు ఇండుగుమిల్లి ప్రసాద్ పక్కా ప్రణాళికతోనే కిడ్నాప్ డ్రామా ఆడాడని తేలింది. ప్రసాద్‌ ఆడిన కిడ్నాప్‌ నాటకానికి పోలీసులు శుక్రవారం తెరదించారు. 24 గంటల్లో కిడ్నాప్ నాటకాన్ని చేధించామని రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ వెంకటేశ్వరరావు శుక్రవారం విలేకరులకు తెలిపారు. 

పోలీసుల కథనం ప్రకారం.. తనను ఎవరో బెదిరిస్తున్నారని, ఈ అవమానం తట్టుకోలేక పోతున్నానని భార్య కౌసల్యకె చెప్పిన ప్రసాద్‌ తన బైక్, సెల్‌ఫోన్‌ ఇంటి దగ్గరే విడిచిపెట్టి రెండు రోజుల కిందట అదృశ్యమయ్యాడు. ఈ మేరకు కౌసల్య ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. 

ప్రసాద్, అతడి స్నేహితుడు పినిపే సందీప్ కాకినాడ దగ్గర్లోని రాయుడుపాకలు వద్ద ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లిన పోలీసులు ఇద్దరినీ పట్టుకుని, విచారించగా షాకింగ్ వారు విషయాలు వెల్లడించారు. 

కొంతమంది ఆదేశాల మేరకు తాను కావాలనే పక్క ప్రణాళికతో కిడ్నాప్‌ డ్రామా ఆడానని ప్రసాద్‌ ఒప్పుకున్నాడు.  కులాల మధ్య చిచ్చు పెట్టి, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతోనే ఇలా చేసినట్టు తెలిపాడు. 

దీనిమీద లోతైన దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కుల వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా, శాంతిభద్రతలకు హాని కలిగించేలా ప్రయత్నించిన ఇంకొంతమందిని తన దర్యాప్తులో గుర్తించామని, మరిన్ని సాక్ష్యాధారాలతో వారిని అరెస్టు చేస్తామని తెలిపారు. 

click me!