పోలవరం ప్రాజెక్టు వద్ద భూకంపం?.. పరుగులు తీసిన జనాలు

Published : Nov 03, 2018, 03:58 PM IST
పోలవరం ప్రాజెక్టు వద్ద భూకంపం?.. పరుగులు తీసిన జనాలు

సారాంశం

 భూకంపం సంభవించినప్పుడు భూమి ఏవిదంగా అయితే చీలుతుందో.. అదేవిధంగా చీలిపోయింది. అది చూసిన గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు. 


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు వద్ద అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఉన్నట్టుండి.. ప్రాజెక్టు సమీపంలోని భూమి బీటలుగా చీలింది. భూకంపం సంభవించినప్పుడు భూమి ఏవిదంగా అయితే చీలుతుందో.. అదేవిధంగా చీలిపోయింది. అది చూసిన గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు. 

వాహనదారులు అటువైపు వెళ్లడానికే భయపడుతున్నారు. కొందరు తమ వాహనాలను అక్కడే వదిలేసి పరుగులు తీశారు. మరోవైపు విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయాయి. అటువైపు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.

ఇదిలా ఉంటే ప్రాజెక్టు చెక్ పోస్టు వద్ద 5 అడుగుల మేర భూమి పైకి చొచ్చుకువచ్చింది. సమాచారం అందుకున్న ప్రాజెక్టు ఇంజినీర్లు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద భూకంపం వచ్చిదంటూ ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Pemmasani Chandrasekhar Spech: 25 సంవత్సరాల ముందు చంద్రబాబు విజన్ ఈ సంఘాలు| Asianet News Telugu
YS Jagan Pressmeet: 2026లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవుతుందని అప్పుడే చెప్పా | Asianet News Telugu