ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో భూకంపం: పరుగు తీసిన జనం (వీడియో)

By telugu teamFirst Published Feb 27, 2021, 9:29 AM IST
Highlights

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో శనివారం ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టర రాజధాని అమరావతి ప్రాంతంలో భూకంపం చోటు చేసుకుంది. ఇళ్లలోని తలుపులు, కిటకీలు దడదడా కొట్టుకున్న శబ్దాలు వినిపించాయి. భయంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

శనివారం ఉదయం 5.30, 6 గంటల మధ్య భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తూళ్లూరు, నెక్కల్లు, అనంతారం, కర్లపూడి ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తాడికొండ మండలం బడెపురంలో పెద్ద శబ్దాలతో ప్రకంపనలు చోటు చేసుకుంది. "

తూళ్లూరు, తాడికొండ, అమరావతి మండలాల్లో భూప్రంకపనలు చోటు చేసుకున్నాయి. తలుపులు దడదడా కొట్టుకోవడంతో ఎవరైనా తలుపులు తడుతున్నారేమోనని బయటకు వచ్చిన ప్రజలు భూప్రంకపనలతో తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు.

click me!