ముగిసిన ద‌స‌రా సెల‌వులు: స్కూల్స్ ఓపెన్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

By Mahesh RajamoniFirst Published Oct 25, 2023, 11:17 AM IST
Highlights

Dasara holidays: దసరా సెలవులు నేటితో ముగియనుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీల్లో ఈరోజు తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. ఇక ఏపీలోనూ ద‌స‌రా సెల‌వులు ముగియ‌డంతో ఆన్‌లైన్‌ హాజర్‌ విధానానికి సంబంధించి తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను ప్ర‌భుత్వం విడుదల చేసింది.
 

Dasara vacation ends today: దసరా సెలవులు నేటితో ముగియనుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీల్లో ఈరోజు తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. ఇక ఏపీలోనూ ద‌స‌రా సెల‌వులు ముగియ‌డంతో ఆన్‌లైన్‌ హాజర్‌ విధానానికి సంబంధించి తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను ప్ర‌భుత్వం విడుదల చేసింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో.. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో స్కూళ్లు మ‌ళ్లీ తెరుచుకున్నాయి. విద్యార్థులకు 11 రోజుల దసరా సెల‌వులను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌గా, ఈ నెల (అక్టోబరు) 24తో ముగిశాయి. దసరా సెలవుల త‌ర్వాత స్కూల్స్ బుధ‌వారం ప్రారంభం అయ్య‌యి. పాఠ‌శాల‌ల ప్రారంభం నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఆన్‌లైన్‌ హాజర్‌ విధానానికి సంబంధించి ప‌లు సూచ‌న‌లు, నిబంధ‌న‌ల‌ను విడుద‌ల చేసింది. ప్ర‌భుత్వం విద్యార్థుల ఆహారు న‌మోదుకోసం ప్ర‌త్యేక యాప్ ను  తీసుకువ‌చ్చింది. ఇందులో ఉదయం 9.00 గంటల్లోపు విద్యార్థుల‌ది,  9:30 గంటల లోపు టీచ‌ర్ల హాజరు వివ‌రాల‌ను పూర్తి చేయాల‌ని పేర్కొంది. టీచ‌ర్ల సెల‌వుల గురించి కూడా ప్ర‌భుత్వం ప్ర‌స్త‌వించింది. టీచర్లు త‌మ సెల‌వుల‌ను ఉదయం 9 గంటల కంటే ముందే యాప్‌లో ఆప్లై చేసుకోవాలని తెలిపింది. 

తెలంగాణ‌లో.. 

13 రోజుల దసరా సెలవుల తర్వాత హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో పాఠశాలలు పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. దసరాకు అక్టోబర్ 13 నుంచి 25 వరకు పాఠశాల విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. పాఠశాలలతో పాటు రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు కూడా గురువారం పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 నుంచి కళాశాల విద్యార్థులకు దసరా సెలవులు వచ్చాయి.

కాగా, ఈ నెల 14 నుంచి 24 వరకు దసరా సెలవులు ప్రకటించడంతో ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీలు నేటి నుంచి తరగతులను పునఃప్రారంభించనున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సాయంత్రాలు బతుకమ్మ, దాండియా నృత్యాలతో కళకళలాడాయి. హైదరాబాద్ లో పలు సంఘాలు దుర్గామాత విగ్రహాలతో మండపాలను ఏర్పాటు చేశాయి. పండుగ ముగియడంతో రేపు హైదరాబాద్ లో పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.

click me!