దుర్గగుడిలో గొడవలు:చంద్రబాబు సీరియస్

By Nagaraju TFirst Published Oct 17, 2018, 8:06 PM IST
Highlights

దుర్గ గుడి వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంద్రకీలాద్రిపై చోటు చేసుకుంటున్న వరుస వివాదాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకమండలి, పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. దసరా ఉత్సవాల కంటే వివాదాలే హైలెట్ అవుతున్నాయని మండిపడ్డారు. 
 

విజయవాడ: దుర్గ గుడి వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంద్రకీలాద్రిపై చోటు చేసుకుంటున్న వరుస వివాదాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకమండలి, పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. దసరా ఉత్సవాల కంటే వివాదాలే హైలెట్ అవుతున్నాయని మండిపడ్డారు. 

తీరు మారకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. చంద్రబాబు ఆగ్రహం చెందారన్న విషయాన్ని సీఎంవో అధికారులు పాలకమండలి చైర్మన్ గౌరంగ బాబుకు ఫోన్ చేసి తెలిపారు. 

పంథాలు పట్టింపులకు పోకుండా అధికారులతో కలిసి సమన్వయంతో పనిచెయ్యాలని సూచించారు. పాలకమండలి, అధికారులు కలిసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. భక్తులకు మౌలిక వసతులు కల్పించాల్సింది పోయి రోజుకో తగువుతో వివాదాలకు కేంద్రబిందువుగా మార్చడం సరికాదంటూ క్లాస్ పీకారు. ఇకనైనా ఆలయంలో వివాదాలకు స్వస్తి పలకాలని, అధికారులతో సమన్వయంతో పని చేయాలని సూచించారు.

దసరా ఉత్సవాల వేళ ఇంద్ర కీలాద్రిపై వరుస వివాదాలు దుమారాన్ని రేపుతున్నాయి. కొత్త సంప్రదాయాలు, రాజకీయాలు వివాదానికి దారితీస్తున్నాయి. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆలయ చైర్మన్ గౌరంగబాబును పోలీస్ సిబ్బంది అడ్డుకోవడం ఒక వివాదం అయింది. ఆ వివాదం సద్దుమణిగే సరికి ప్రోటోకాల్ వివాదం మరో వివాదానికి కారణం అయ్యింది. 

ప్రతీ ఏడాది అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సారి సమర్పించడం ఆనవాయితీ. అయితే ఈ సమయంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా ఉన్న తనను కాకుండా ఏఈవో చేత సారి సమర్పించడంపై బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస వివాదాలతో చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

click me!