జగన్ కు మదమెక్కి అతిచేస్తున్నాడు... ఇలాంటి వారందరి సంగతి చూస్తాం..: చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Arun Kumar P   | Asianet News
Published : May 05, 2022, 09:58 AM ISTUpdated : May 05, 2022, 10:09 AM IST
జగన్ కు మదమెక్కి అతిచేస్తున్నాడు... ఇలాంటి వారందరి సంగతి చూస్తాం..: చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

సారాంశం

బాదుడే బాదుడు నిరసనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో పర్యటించిన టిడిపి అధినేత చంద్రబాబు సీఎం జగన్, వైసిపి ప్రభుత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

శ్రీకాకుళం: వైసిపి సర్కార్ ప్రజలకు సంక్షేమఫలాలు అందించాల్సింది పోయి ప్రజలనే దోపిడీ చేస్తోందని ప్రతిపక్ష తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం జగన్, వైసిపి ప్రభుత్వం ఇష్టారీతిన పన్నులు, నిత్యావసర ధరలు పెంచి ప్రజాధనాన్ని ఎలా దోచుకుంటున్నారో ప్రజల్లోకి వెళ్లి వివరించేందుకు బాదుడే బాదుడు పేరిట నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. 

ఆముదాలవలసలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రాన్ని వైసిపి ప్రభుత్వం కాదు బాదుడు ప్రభుత్వం పాలిస్తోందని అన్నారు. ఆనాడు ముద్దులు - ఇప్పుడు గుద్దులు...ఇదే జగన్ పాలన అంటూ ఎద్దేవా చేసారు. జగన్ పాలనతోనే రాష్ట్రానికి అరిష్టమని...  కరోనా కంటే జగన్ పాలనే ప్రమాదకరమని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు భరించలేని విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. 


 
''ఒక్క చాన్స్ అని అడిగాడు...  ప్రజలంతా మాయలో పడ్డారు. ఇప్పుడు అదే చివరి ఛాన్స్ అయ్యింది. 151 ఎమ్మెల్యే సీట్లు గెలిచానని జగన్ కు మదం ఎక్కింది. అందుకే మా ఇంటిపై దాడి చేశారు... టిడిపి నేతలపైన కేసులు పెడుతున్నారు. టిడిపి దేవాలయంగా భావించే పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. నన్ను అవమానించినా పర్వాలేదు... నిండు సభలో మా కుటుంబ సభ్యులను అవమానించారు. అందుకే కౌరవ సభలో అడుగు పెట్టను అని చెప్పాను'' అని గుర్తుచేసారు. 

''తిడితే భయపడం... ఖబర్దార్... జాగ్రత్తగా ఉండండి...ప్రజల ముందు నిలబెడతాం. జగన్ ను శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేస్తాం. మాపై వేధింపులపై కమిటీ వేసి అందరి సంగతి చూస్తాం'' అని చంద్రబాబు హెచ్చరించారు. 

''రాష్ట్రంలో వంట నూనె, గోధుమ పిండి, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో పవర్ కట్స్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అసలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉంటుందా? ఇది చాలదన్నట్లు ఈ నెల విద్యుత్ చార్జీలు బిల్లులు మరింత బాదుడే బాదుడుకు సిద్దమయ్యారు. మీ గుండె ఆగిపోయే స్థాయి కరెంట్ బిల్లులు వస్తాయి. టిడిపి హయాంలో దీర్ఘకాలిక ప్రణాళికలుతో నిరంతర విద్యుత్ ఇచ్చాం. విద్యుత్ బిల్లులు పెంచి ప్రజలపై భారం వేయలేదు'' అని చంద్రబాబు పేర్కొన్నారు. 

''కేంద్రం చెప్పినా పెట్రోల్ పై జగన్ ఒక్క రూపాయి తగ్గించడం లేదు. టిడిపి హయాంలో పెట్రోల్ పై 5 రూపాయలు తగ్గించాము. ఇక చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ మాత్రమే. ఏపీలో ఉండే మద్యం బ్రాండ్స్ ఎక్కడా ఉండవు. నాణ్యత లేని మద్యంతో ప్రజల ఆరోగ్యాలు గుల్ల అవుతున్నాయి. అన్నీ జగన్ బ్రాండ్స్...  జె. బ్రాండ్ కల్తీ మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుంది. జగన్ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు... చివరికి యువతకు మద్యం అలవాటు చేయిస్తున్నారు'' అని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. 

''ఆసుపత్రి ఖర్చు 1000 రూపాయలు దాటితే మొత్తం ఆరోగ్య శ్రీలో ఇస్తానన్నాడు... మాట తప్పాడు. టిడిపి హాయాంలో కుటుంబ ఖర్చు ఎంత...ఎప్పుడు ఖర్చు ఎంత ప్రజలు బేరీజు వేసుకోవాలి. సిండికేట్ పెట్టి భారతి సిమెంట్ కి లాభం చేశారు. అందుకే సిమెంట్ రేటు పెరిగింది. పేదోడు సిమెంట్ కొనలేని పరిస్థితి. జగన్ ప్రభుత్వంలో ఒక్క రోడ్డు వేయలేదు. కానీ రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఈ లక్షల కోట్లు ఎవరు కడతారు? ఆ భారం ప్రజలే భరించాలి. జగన్ కారణంగా రాష్ట్రం మరో శ్రీలంక లా తయారవుతుంది'' అని ఆందోళన వ్యక్తం చేసారు. 

''సీపీఎస్ రద్దు అని  ఉద్యోగులను మోసం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ధాన్యంకు మద్దతు ధరలు లేవు. అప్పుల కోసం వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లకు పెడుతున్నాడు. మోటర్లకు మీటర్లు పెడితే అవి రైతుల మెడకు ఊరితాళ్లు అవుతాయి. నాడూ నేడూ పేరుతో స్కూల్ బిల్డింగులకు రంగులు వేసి డబ్బులు కొట్టేస్తున్నారు. 10 వ తరగతి పేపర్ లీకేజ్ తో పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. టెన్త్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహించి జగన్ రాజీనామా చేస్తాడా...లేక బొత్స చేస్తాడా?'' అని నిలదీసారు. 

''రాష్ట్రం మొత్తం గంజాయి ,డ్రగ్స్ సరఫరా పెరిగిపోయింది. అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఆడబిడ్డ కు రక్షణ లేదు. అత్యాచారాలు రొటీన్ గా జరుగుతాయంటూ స్వయంగా హోంమంత్రి మాట్లాడటం రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా వుందో తెలియజేస్తుంది'' అన్నారు. 

''తిత్లీ తుఫానుకు ఇస్తాను అన్న రెట్టింపు పరిహారం ఏమయ్యింది. పలాస ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ ఏమయ్యింది? పనులు ఎందుకు ఆగిపోయాయి. నారాయణపురం ప్రాజెక్ట్ రీ మోడ్రనైజేషన్ పనులు నిలిపి వేశారు.వంశధార పనులు టీడీపీ హయాంలో 92 శాతం పూర్తి చేస్తే...జగన్ మిగిలిన పని పూర్తి చెయ్యలేదు. ఈ పనులు చెయ్యలేని జగన్ మూడు రాజధానులు కడతారా? ప్రజలు ప్రభుత్వంపై పోరాడాలి...నాకోసం కాదు..రాష్ట్రం కోసం అంతా కలిసి రావాలి'' అని చంద్రబాబు కోరారు. 

PREV
click me!

Recommended Stories

Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్
Success Story : అన్న క్యాంటీన్ నుండి పోలీస్ జాబ్ వరకు .. ఈమెది కదా సక్సెస్ అంటే..!