జగన్ అలా కోరుకోవడంలో తప్పులేదు.. జేసీ

Published : Nov 30, 2018, 09:46 AM IST
జగన్ అలా కోరుకోవడంలో తప్పులేదు.. జేసీ

సారాంశం

జేసీ ఇలా జగన్ కి అనుకూలంగా మాట్లాడటంతో టీడీపీ నేతలు ఒకింత షాక్ కి గురయ్యారు.

వైసీపీ అధినేత  జగన్ పై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  సంచలన కామెంట్స్ చేశారు. "జగన్ 25 ఎంపీ స్థానాలు కోరుకోవడం తప్పు లేదు. ప్రజలు జగన్‌కు ఇవ్వాలి.. ఇస్తే సంతోషం. 25 స్థానాలు ఇవ్వకపోతే ఇంటికి పోతాడు.. అంతే" అని జేసీ చెప్పుకొచ్చారు. గురువారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన జేసీ పై వ్యాఖ్యలు చేశారు. 

 జేసీ ఇలా జగన్ కి అనుకూలంగా మాట్లాడటంతో టీడీపీ నేతలు ఒకింత షాక్ కి గురయ్యారు. 
2019 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పేశారు.

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి టీడీపీకి ఏ పార్టీ మద్దతు అక్కర్లేదని.. ఒంటరిగానే పోటీచేసి టీడీపీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 
దేశ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. దేశం యొక్క అవసరం దృష్ట్యా రాష్ర్టంలో కాంగ్రెస్‌- టీడీపీ పొత్తు పెట్టుకొనే అవకాశం ఉంటుందేమోనన్నారు. 

చంద్రబాబు ఒక్కరే చెబితే ప్రధాని అవ్వరని.. అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్లి ప్రధానిని ఏర్పాటు చేసుకోవాలని జేసీ చెప్పుకొచ్చారు. తెలంగాణలో మహాకూటమి గెలవాలని తాను కోరుకుంటున్నానని.. అయితే ప్రజలు ఏం తీర్పునిస్తారో వేచి చూడాల్సిందేనని జేసీ తెలిపారు.

" మొదట్నుంచి కూడా ఏపీకి కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తానంటోంది.. ఇపుడు కూడా అదే మాట చెబుతోంది. ఇంకో మాట చెబుతుందా..! టీడీపీతో కలవక ముందు కూడా కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది. టీడీపీతో కలిసిన తర్వాత కూడా అదే మాట చెబుతోంది" అని జేసీ ఈ సందర్భంగా మీడియాకు వివరించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తీవ్రవాయుగుండం తీరం దాటేది ఇక్కడే.. ఈ రెండ్రోజులూ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలే వర్షాలు
Bhumana Karunakar Reddy: కూటమి పాలనలో దిగ‌జారుతున్న తిరుమ‌ల ప్ర‌తిష్ట | TTD | Asianet News Telugu