మర్డర్ కేసులో ఇరుక్కున్న డిఎస్పీ

Published : Oct 15, 2017, 07:32 AM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
మర్డర్ కేసులో ఇరుక్కున్న డిఎస్పీ

సారాంశం

‘కంచే చేనుమేస్తోంది’...ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే హత్యలు చేయిస్తున్నారు. పోలీసుశాఖలో ఇప్పటి వరకూ దందాలు చేయించిన వారున్నారు. కిరాయిమూకలను మాట్లాడుకుని ధౌర్జన్యాలు చేయించిన వారున్నారు. ప్రతీ నెలా రౌడీల దగ్గర నుండే నెలవారీ మామూళ్ళు వసూళ్ళు చేయించుకుంటున్న పోలీసులనీ చూసాము. అయితే, తాజాగా ఓ పోలీసు అధికారే విలన్ గ్యాంగ్ తో కలిసి మర్డర్ ప్లాన్ చేయటం, హత్యలు చేయించటం సంచలనంగా మారింది.

‘కంచే చేనుమేస్తోంది’...ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే హత్యలు చేయిస్తున్నారు.

పోలీసుశాఖలో ఇప్పటి వరకూ దందాలు చేయించిన వారున్నారు. కిరాయిమూకలను మాట్లాడుకుని ధౌర్జన్యాలు చేయించిన వారున్నారు. ప్రతీ నెలా రౌడిల దగ్గర నుండే నెలవారీ మామూళ్ళు వసూళ్ళు చేయించుకుంటున్న పోలీసులనీ చూసాము. అయితే, తాజాగా ఓ పోలీసు అధికారే విలన్ గ్యాంగ్ తో కలిసి మర్డర్ ప్లాన్ చేయటం, హత్యలు చేయించటం సంచలనంగా మారింది. తన ఆదేశాల ప్రకారమే ఓ హత్య చేసిన రౌఢీ షీటర్ను మరో హంతకముఠాతో హత్య చేయించటం అచ్చు సినిమా కథలోలాగుంది.

ఈమధ్య విశాఖపట్నంలో గేదెలరాజు అనే రౌడిషీటర్ హత్యకు గురయ్యాడు గుర్తుందా? ఆ హత్య కేసును విచారించిన పోలీసు ఉన్నతాధికారులకు దిమ్మతిరిగే విషయం తెలిసింది. రాజు హత్యకు పథకం వేసిందే  విజిలెన్స్ డిఎస్పీ రవిబాబట.  

ఇంతకీ జరిగిందేమిటంటే, విశాఖపట్నం జిల్లాలో ఓ డిఎస్పీ వరస హత్యలు చేయించాడు. ప్రియురాలిని అడ్డుతొలగించుకునేందుకు కొంతకాలం క్రిందట ఓ రౌడిషీటర్ ను ఉపయోగించుకున్నాడు. కోటి రూపాయలకు డీల్ కుదిరింది. డీల్ ప్రకారం రౌఢిషీటర్ హత్య చేసాడు. అయితే, ముందుగా అనుకున్న ప్రకారం డిఎస్పీ కోటి రూపాయలు కాకుండా 50 లక్షలే ఇచ్చాడు. దాంతో రౌడిషీటర్ నిలదీసాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.

ఈ నేపధ్యంలోనే రౌడిషీటర్ హటాత్తుగా హత్యకు గురయ్యాడు. చనిపోయిందిద రౌడిఫీటర్ కావటంతో సంచలనమైంది.  దాంతో పోలీసు ఉన్నతాధికారులు సవాలుగా తీసుకుని పరిశోధన జరిపారు. అందులో ఆశ్చర్యపోయే విషయాలు తెలిసాయి. విషయాన్ని మరింత లోతుగా పరిశోధిస్తే డిఎస్పీ సారే మరో ముఠాను మాట్లాడుకుని తనకు అడ్డం తిరిగిన రౌడిని హత్య చేయించినట్లు నిర్ధారణైంది.

పోలీసుశాఖ చరిత్రలోనే ఓ డిఎస్పీ హత్య కేసులో ఏ1గా నిలవటం ఇదే మొదటిసారి. అదే విషయాన్ని విశాఖ జాయింట్ పోలీసు కమీషనర్ మీడియాతో వివరించారు. మరి, హత్యకేసులో ఏ 1 అయిన డిఎస్పీపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు| Asianet News Telugu
Pemmasani Chandrasekhar Powerful Speech: Atal Bihari Vajpayee 101st Jayanthi | Asianet News Telugu