మంత్రిపై క్రిమినల్ కేసా ?

Published : Oct 14, 2017, 06:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
మంత్రిపై క్రిమినల్ కేసా ?

సారాంశం

కొన్ని రోజులుగా కార్పొరేట్ కాలేజీలలో విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయంపై ఎట్టకేలకు మంత్రి గంటా శ్రీనివాసరావు కదిలారు. విశాఖ నగరంలోని నారాయణ-చైతన్య హాస్టళ్లలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. హాస్టళ్లలోని పరిస్థితులను పరిశీలించారు. విద్యార్దుల సమస్యల అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదన్నారు.

అవసరమైతే కాలేజీ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడ వెనుకాడబోమని మంత్రి హెచ్చరించారు. ఈ నెల 16న రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో సమావేశం కాబోతున్నట్లు చెప్పారు. ఇంటర్‌ బోర్డ్‌ పేర్కొన్న నిబంధనలను అన్ని కళాశాలలు విధిగా అమలుచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

అయితే 158 హాస్టళ్లకు అనుమతులే లేవని ఓ వైపే ప్రచారం జరుగుతోంది. అందులో నారాయణ, చైతన్య కళాశాలల హాస్టళ్ళు కూడా ఉన్నాయి. మంత్రి గంటా నిజంగానే వాటి యాజమాన్యాలపై చర్చలు తీసుకోగలరా? ఎందుకంటే, విద్యాశాఖ మంత్రి గంటా, నారాయణ కళాశాలల యాజమాన్యం, సహచర మంత్రి నారాయణ వియ్యంకులన్న సంగతి అందరికీ తెలిసిందే. దాంతో గంటా హెచ్చరికలు విన్నవారు తేలిగ్గా తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu