ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త .. సంక్రాంతి తర్వాత మెగా డీఎస్సీ ప్రకటన

Siva Kodati |  
Published : Jan 13, 2024, 08:04 PM ISTUpdated : Jan 13, 2024, 08:12 PM IST
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త .. సంక్రాంతి తర్వాత మెగా డీఎస్సీ ప్రకటన

సారాంశం

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వుంటుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఇప్పటికే మెగా డీఎస్సీపై సీఎం వైఎస్ జగన్‌తో చర్చించడం జరిగిందని, పోస్టుల సంఖ్య , ఉద్యోగాల భర్తీపై విధి విధానాలను త్వరలోనే తెలియజేస్తామని బొత్స వెల్లడించారు. 

కాగా.. గతేడాది అక్టోబర్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే విద్యాశాఖలో ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేస్తామని బొత్స వెల్లడించారు. యూనివర్సిటీలు, ఐఐఐటీల్లో ఖాళీగా వున్న 3,200కు పైగా పోస్టులను కొద్దిరోజుల్లో భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. గడిచిన 18 ఏళ్లుగా వర్సిటీల్లో పోస్టుల భర్తీ జరగలేదని బొత్స పేర్కొన్నారు.

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహిస్తామని.. వర్సిటీల వారీగా ఇంటర్వ్యూలను నిర్వహిస్తామని బొత్స సత్యనారాయణ చెప్పారు. అలాగే త్వరలోనే డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తామని.. దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోందని మంత్రి తెలిపారు. ముందు టెట్, ఆ తర్వాత డీఎస్సీ వుంటుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లోపే డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని ఆయన సంకేతాలిచ్చారు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నువ్వు నీతులు చెప్పకు అక్క : Byreddy Siddarth Reddy Counter To Byreddy Shabari | Asianet Telugu
TG భ‌ర‌త్ వ్యాఖ్య‌ల‌పై బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి కౌంట‌ర్ Baireddy Siddharth Reddy | Asianet Telugu