మద్యంమత్తులో భార్యపై పిడిగుద్దులు, తలను నేలకేసి కొట్టి హత్య.. తెల్లారాక...

Published : Aug 04, 2021, 12:12 PM IST
మద్యంమత్తులో భార్యపై పిడిగుద్దులు, తలను నేలకేసి కొట్టి హత్య.. తెల్లారాక...

సారాంశం

ఇటీవల మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. ఇంటికి తరచూ ఆలస్యంగా వచ్చేవాడు. అతడి తీరుతో విసిగిపోతున్న దుర్గా ఈశ్వరి పలుమార్లు నిలదీసింది. సోమవారం రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో భర్తకు ఫోన్ చేసింది. 

ముమ్మిడివరం : మద్యం మత్తులో భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడో వ్యక్తి. ముమ్మిడివరం నగర పంచాయతీ శివారు నక్కావారిపేటలో సోమవారం రాత్రి ఈ హత్యోదంతం వెలుగుచూసింది. 

నక్కవారిపేటకు చెందిన కాశి రవీంద్రకు 14 యేళ్ల కిందట ఉప్పలగుప్తం మండలం గోపవరానికి చెందిన అంబటి దుర్గా ఈశ్వరి (32)తో పెళ్లయ్యింది. వీరికి 12 యేళ్ల భరత్, తొమ్మిదేళ్ల శరత్ అనే ఇద్దరు కుమారులున్నారు. నగర పంచాయతీలో రవీంద్ర కాంట్రాక్టు ప్రాతిపదికపై చెత్త తరలింపు ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 

ఇటీవల మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. ఇంటికి తరచూ ఆలస్యంగా వచ్చేవాడు. అతడి తీరుతో విసిగిపోతున్న దుర్గా ఈశ్వరి పలుమార్లు నిలదీసింది. సోమవారం రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో భర్తకు ఫోన్ చేసింది. 

దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్: ఏపీ హైకోర్టు ఆదేశాలు

ఆ సమయంలో రవీంద్ర యానాంలో మద్యం తాగుతున్నట్టు తెలుసుకుని గట్టిగా నిలదీసింది. తర్వాత కూడా ఇంటికి రాకపోవడంతో అతడికోసం బయలుదేరింది. 200 మీటర్ల దూరం వెళ్లేసరికి భర్త ఎదురుపడ్డాడు. వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న రవీంద్ర భార్య దుర్గా ఈశ్వరిపై దాడి చేశాడు. 

అతడి పిడిగుద్దులకు ఆమె కింద పడింది. వెంటనే ఆమె తలను రోడ్డుకు వేసి కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. మృతేదహాన్ని రోడ్డు పక్కన కాలువలో పడేసి రవీంద్ర ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. ఉదయాన్నే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి తానే భార్యను హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు. అమలాపురం డీఎస్పీ ఎం. మాధవరెడ్డి, సీఐ ఎం. జానకీరామ్, ఎస్సై కె. సురేష్ బాబు సంఘటన స్థలనికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీయించారు. శవ పంచనామా నిర్వహించారు. 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Warning at NTR District | “మీ ఉద్యోగం పోతుంది చూసుకోండి” | Asianet News Telugu
IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు