దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్: ఏపీ హైకోర్టు ఆదేశాలు

By narsimha lodeFirst Published Aug 4, 2021, 11:08 AM IST
Highlights


ఏపీ హైకోర్టు బుధవారం నాడు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు బెయిల్ మంజూరు చేసింది.  దేవినేని ఉమా మహేశ్వరరావు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు ఉమా మహేశ్వరరావుకు బెయిల్ మంజూరు చేసింది.


విజయవాడ: మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఏపీ హైకోర్టు బుధవారం నాడు బెయిల్ మంజూరు చేసింది.దేవినేని ఉమా బెయిల్ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు రెండు రోజుల క్రితం తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ బెయిలిస్తున్నట్టుగా ప్రకటించింది. మాజీ మంత్రి ఉమాపై ఎస్పీ,ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద  జి. కొండూరు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. 

 

మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఏపీ హైకోర్టు బుధవారం నాడు బెయిల్ మంజూరు చేసింది.దేవినేని ఉమా బెయిల్ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు రెండు రోజుల క్రితం తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ బెయిలిస్తున్నట్టుగా ప్రకటించింది. pic.twitter.com/MfJdC6fiWq

— Asianetnews Telugu (@AsianetNewsTL)

మైనింగ్ జరిగే ప్రాంతాన్ని పరిశీలించి వస్తున్న సమయంలో  వైసీపీ కార్యకర్తలు ఉమా వాహనంపై దాడి చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ విషయమై  జి. కొండూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు కూడ దేవినేని ఉమామహేశ్వరరావు ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి గురైన దేవినేని అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై  టీడీపీ నేతలు మండిపడ్డారు. 

ఉద్దేశ్యపూర్వకంగానే దేవినేని ఉమాపై ఎస్పీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఆయన తరపు న్యాయవాది వాదించారు. కొండపల్లిలో జరిగిన  పార్టీ సమావేశంలో గ్రామస్తులు ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్లడంతో అప్పటికప్పుడే ఆయన ఆ  ప్రాంతాన్ని సందర్శించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసు విచారణ సాగుతుందని, ఇంకా కొందరిని అరెస్ట్ చేయాల్సి ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పారు. ఈ తరుణంలో ఉమాకు బెయిలివ్వద్దని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న  హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
 

click me!