నీటి పోరు: సిజెఐ ఎన్వీ రమణ సూచనకు ఏపీ నో, మరో బెంచీకి కేసు బదిలీ

By narsimha lodeFirst Published Aug 4, 2021, 11:40 AM IST
Highlights

ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటివివాదంపై మధ్యవర్తిత్వం మేలని సీజేఐ సూచించారు. అయితే న్యాయప్రక్రియ ద్వారానే సమస్య పరిష్కరించుకొంటామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీంతో  ఈ పిటిషన్ ను మరో బెంచీకి సీజేఐ బదిలీ చేశారు.


న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను మరో బెంచీకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ బదిలీ చేశారు.ఈ సమస్య పరిష్కారానికి న్యాయ ప్రక్రియ కంటే మధ్యవర్తిత్వం మేలని ఆయన రెండు రోజుల క్రితం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సూచించారు. గతంలో ఈ కేసును వాదించిన అనుభవాన్ని కూడ ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే ఈ విషయమై రెండు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు తెలుసుకొని చెబుతామని రెండు రాష్ట్రాల న్యాయవాదులు చెప్పారు.

కృష్ణా నదీ జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను మరో బెంచీకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ బదిలీ చేశారు.ఈ సమస్య పరిష్కారానికి న్యాయ ప్రక్రియ కంటే మధ్యవర్తిత్వం మేలని ఆయన రెండు రోజుల క్రితం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సూచించారు pic.twitter.com/3qsv1ySErb

— Asianetnews Telugu (@AsianetNewsTL) > 

 

కృష్ణా నదిజలాల విషయంలో  తెలంగాణ వైఖరిని నిరసిస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై న్యాయప్రక్రియ ద్వారానే పరిష్కారం కావాలని కోరుకొంటున్నట్టుగా ఏపీ ప్రభుత్వం కోరుకొంటుంది. ఇదే విషయాన్ని సీజేఐకి ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది ఇవాళ చెప్పారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణను మరో బెంచీకి బదిలీ చేశారు  సీజేఐ ఎన్వీరమణ.సీజేఐ ధర్మాసనమే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టాలని కేంద్రం కోరింది. అయితే ఈ ప్రతిపాదనను సీజేఐ నిరాకరించారు.

click me!