ప్రజల భయమే పెట్టుబడి: ఏపీలో బయటపడుతున్న నకిలీ మందుల మాఫియా గుట్టు

Siva Kodati |  
Published : Mar 03, 2021, 05:27 PM ISTUpdated : Mar 03, 2021, 06:03 PM IST
ప్రజల భయమే పెట్టుబడి: ఏపీలో బయటపడుతున్న నకిలీ మందుల మాఫియా గుట్టు

సారాంశం

కరోనా వేళ ఏపీలో మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రజల భయాన్ని క్యాష్ చేసుకుంటోంది. నకిలీ మందులతో వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. అధిక ధరలు వసూలు  చేసి  సామాన్యుల జేబులు గుల్లచేసింది

కరోనా వేళ ఏపీలో మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రజల భయాన్ని క్యాష్ చేసుకుంటోంది. నకిలీ మందులతో వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. అధిక ధరలు వసూలు  చేసి  సామాన్యుల జేబులు గుల్లచేసింది.

ఇప్పుడు తీగ లాగితే డొంక కదిలినట్లు.. పశ్చిమ గోదావరి జిల్లాలో మెడికల్ మాఫియా గుట్టు రట్టయ్యింది. కరోనా వేళ భయాందోళనలకు గురైన ప్రజలు జలుబు, దగ్గు వస్తేనే వణికిపోయారు.

ఏవేవో మందులు వాడి తీవ్ర ఇబ్బందులకు  గురయ్యారు. పూర్తిగా అవగాహన లేని మొదటి దశలో ఈ మందుల వాడకం మరీ ఎక్కువగా వుండేది. ఇదే అదనుగా భావించిన మెడికల్ మాఫియా అక్రమాలకు పాల్పడిందని, నికిలీ మందులను విక్రయించారని అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలో నకిలీ మెడికల్ మాఫియాపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులు, హోల్‌సేల్ దుకాణాలపై తనిఖీలకు ఆదేశించింది. పాలకొల్లు, భీమవరంలోని కొన్ని షాపుల్లో ఈ నకిలీ మందులు బయటపడ్డాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!