సుజనా చౌదరికి షాక్.... ఆయన భార్యకు డీఆర్టీ నోటీసులు

Published : Dec 05, 2019, 06:45 AM IST
సుజనా చౌదరికి షాక్.... ఆయన భార్యకు డీఆర్టీ నోటీసులు

సారాంశం

చెన్నైలోని ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.169 కోట్లు రుణం తీసుకుని.. చెల్లించని వ్యవహారంలో ఈ నోటీసులు పంపింది.

బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి  ఊహించని షాక్ తగిలింది. సుజనా చౌదరి భార్య వై. పద్మజకు రుణాల రికవరీ ట్రైబ్యునల్‌ (డీఆర్‌టీ)-2 నోటీసులు జారీచేసింది. 

చెన్నైలోని ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.169 కోట్లు రుణం తీసుకుని.. చెల్లించని వ్యవహారంలో ఈ నోటీసులు పంపింది. ఆమెతో పాటు సుజనా యూనివర్సల్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌కు చెందిన శ్రీనివాసరాజు, ఎస్‌టీ ప్రసాద్‌, ఆయన భార్య ధనలక్ష్మి, సుజనా కేపిటల్‌ సర్వీస్‌ లిమిటెడ్‌, ఎక్స్‌ప్లెయిర్‌ ఎలక్ర్టికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు ఈ నెల 16వ తేదీన ఉదయం 11 గంటలకు తన ముందు హాజరుకావాలని ఆదేశించింది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : రుతుపవనాలు అలర్ట్, ద్రోణి ఎఫెక్ట్ .. ఈ ప్రాంతాల్లో ఇక వర్షబీభత్సమే
Pawan Kalyan Fan Niranjan అభిమాని కోసం పవన్ శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు| Asianet Telugu