దారుణం: వివాహితపై మహిళ యాసిడ్ దాడి....రీజన్ ఏంటంటే.....

Published : Dec 04, 2019, 09:22 PM IST
దారుణం: వివాహితపై మహిళ యాసిడ్ దాడి....రీజన్ ఏంటంటే.....

సారాంశం

విశాఖపట్నం జిల్లా గాజువాకలోని సమతానగర్ కు చెందిన శిరీష అనే వివాహిత తన ఇంటికి వచ్చింది. హైదరాబాద్ లో నివాసముంటున్న శిరీష సొంతింటికి వచ్చిన గంటలోనే ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.   

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ లో నివశిస్తూ సొంతింటికి వచ్చిన వివాహితపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడింది. దాంతో తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని వైద్య చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 

వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం జిల్లా గాజువాకలోని సమతానగర్ కు చెందిన శిరీష అనే వివాహిత తన ఇంటికి వచ్చింది. హైదరాబాద్ లో నివాసముంటున్న శిరీష సొంతింటికి వచ్చిన గంటలోనే ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. 

శిరీష అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చింది, యాసిడ్ దాడికి పాల్పడింది మహిళా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. శిరీష అనే వివాహితపై దాడికి పాల్పడింది మహిళేనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా మహిళలపై దాడులకు జరుగుతున్న నేపథ్యంలో న్యూ పోర్టు పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాధితురాలిని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. బాధితురాలు 35 శాతం కాలిన గాయాలతో బాధపడుతుంది. ప్రస్తుతం ఆమె స్పృహలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Cordon and Search Operation in Nellore: రౌడీలకు మందు బాబులకు చుక్కలే | Police | Asianet News Telugu
రైతులకు పట్టదారు పాసుపుస్తకాల పంపిణీ చేసిన Minister Anam Ramanarayana Reddy | Asianet News Telugu