ఏటీఎం వ్యాన్‌తో డ్రైవర్ జంప్.. ఏపీ- కర్ణాటక బోర్డర్‌లోని చెట్ల పొదల్లో రూ.53 లక్షలు గుర్తింపు

By Siva KodatiFirst Published Sep 17, 2022, 3:30 PM IST
Highlights

కడపలో సంచలనం రేపిన ఏటీఎం వాహనం చోరీపై దర్యాప్తు వేగవంతమైంది. ఆంధ్రా- కర్ణాటక సరిహద్దుల్లో చెట్ల పొదల్లో నుంచి రూ.53 లక్షల నగదను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు పోలీసులు. మిగతా సొమ్ముతో రాష్ట్రం దాటినట్లు అనుమానిస్తున్నారు.

కడపలో సంచలనం రేపిన ఏటీఎం వాహనం చోరీపై దర్యాప్తు వేగవంతమైంది. డబ్బును ఎత్తుకెళ్లిన డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఏటీఎం వాహనం నుంచి డబ్బులు ఎత్తుకెళ్లిన డ్రైవర్.. ఆంధ్రా- కర్ణాటక సరిహద్దుల్లో కొంత మొత్తాన్ని దాచి పెట్టాడు. చెట్ల పొదల్లో నుంచి రూ.53 లక్షల నగదను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు పోలీసులు. మిగతా సొమ్ముతో రాష్ట్రం దాటినట్లు అనుమానిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కర్ణాటకలోనూ గాలిస్తున్నారు. 

కాగా.. కడప నగరంలోని వివిధ జాతీయ బ్యాంకులకు చెందిన ఏటీఎం మిషన్‌లలో నిల్వచేసే నగదుతో డ్రైవర్ పరారైన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్ల కలకలం రేపిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం రూ.80 లక్షల నగదుతో సీఎంఎస్ ఏజెన్సీ వాహనం బయల్దేరింది. దీనికి కడపకు చెందిన షారుఖ్ డ్రైవర్‌గా వ్యవహరిస్తున్నాడు. నిన్న నగరంలోని ఐటీఐ సర్కిల్ వద్ద వున్న స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో నగదు పెడుతుండగా.. షారుఖ్ వాహనంతో పారిపోయాడు. 
 

click me!