విశాఖ మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జీ అయిన డాక్టర్ సుధాకర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. డాక్టర్ సుధాకర్ ఆచూకీపై సీబీఐ అధికారులు కూపీ లాగుతున్నారు. ఆయన ఎక్కడున్నాడనేది తెలియడం లేదు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ సుధాకర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. డాక్టర్ సుధాకర్ కేసును సిబిఐ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన డాక్టర్ సుధాకర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. అతని ఆచూకీపై సిబిఐ అధికారులు కూపీ లాగుతున్నారు.
ఎన్నో మలుపులు తిరిగిన తర్వాత విశాఖపట్నం మానసిక వైద్యశాల నుంచి డాక్టర్ సుధాకర్ హైకోర్టు ఆదేశాలతో డిశ్చార్జీ అయ్యారు. ఆ తర్వాత శనివారం అర్థరాత్రి తర్వాత ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
undefined
Also Read: హైకోర్టు ఆదేశాల ఎఫెక్ట్: డాక్టర్ సుధాకర్ డిశ్చార్జీ, భార్యతో కలిసి ఇంటికి..
శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన తర్వాత డాక్టర్ సుధాకర్ భార్యతో కలిసి ఇంటికి వెళ్లారు. కోర్టు ఆదేశాలతో సుధాకర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. కోర్టుఆదేశాలు అందిన తర్వాత డాక్టర్ సుధాకర్ ఆస్పత్రి సూపరింటిండెంట్ కు లేఖ రాశారు. దాని ఆధారంగా ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు.
మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న తన కుమారుడిని హైకోర్టులో హాజరు పరిచేలా ఆదేశాలు ఇవ్వాలని సుధాకర్ తల్లి కావేరి లక్ష్మిబాయి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ మీద విచారణ సాగించిన హైకోర్టు సూపరింటిండెంట్ అనుమతితో డిశ్చార్జీ కావచ్చునని చెప్పింది.
Also Read: ఆసుపత్రి నుండి డాక్టర్ సుధాకర్ డిశ్చార్జికి హైకోర్టు అనుమతి, కానీ....
సుధాకర్ తమ కస్టడీలో లేరని, మెరుగైన చికిత్స కోసం విశాఖ మానసిక వైద్య శాలలో ఉన్నారని, డిశ్చార్జీ కావాలనుకుంటే కావచ్చునని ప్రభుత్వం తెలిపింది. దీంతో సుధాకర్ డిశ్చార్జీ కావడం సులభమైంది. సిబిఐ విచారణకు అందుబాటులో ఉండాలని హైకోర్టు సుధాకర్ ను ఆదేశించింది.