ముందస్తు పై ‘దేశం’ వెనకడుగు

Published : Apr 27, 2017, 03:13 AM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
ముందస్తు పై ‘దేశం’ వెనకడుగు

సారాంశం

దేశంలో ఏకకాలంలో ఎన్నికలు జరగటం మంచిదేనని ఒకవైపు చంద్రబాబు చెబతుంటే, ఇంకోవైపు ఏకకాలంలో ఎన్నికలు సాధ్యం కాదని లోకేష్ ఎందుకు చెబుతున్నారు? తండ్రి కొడుకులు పరస్పర విరుద్ధమైన వాదనలు ఎందుకు వినిపిస్తున్నట్లు?

ముందస్తు ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ వెనకడుగు వేసినట్లే కనిపిస్తోంది. మొన్నటి వరకూ చంద్రబాబునాయుడేమో ముందస్తుకు సిద్ధం కావాలంటూ నేతలకు అనేక సందర్భాల్లో పిలుపినిచ్చిన సంగతి తెలిసిందే కదా? అంటే అర్ధం ఏమిటి? ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు రావాచ్చన్నదే కదా? మరి చంద్రబాబు అలా అటుంటే నారా లోకేష్ మాత్రం ముందస్తుకు ఎవరు ఒప్పుకుంటారు? అని ప్రశ్నించటంలో అర్ధం ఏమిటి?

దేశంలో ఏకకాలంలో ఎన్నికలు జరగటం మంచిదేనని ఒకవైపు చంద్రబాబు చెబతుంటే, ఇంకోవైపు ఏకకాలంలో ఎన్నికలు సాధ్యం కాదని లోకేష్ ఎందుకు చెబుతున్నారు? తండ్రి కొడుకులు పరస్పర విరుద్ధమైన వాదనలు ఎందుకు వినిపిస్తున్నట్లు?

లోకేష్ మీడియాతో మాట్లాడుతూ, ముందస్తు ఎన్నికలంటే దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఒప్పుకోదని స్పష్టంగా చెప్పారు. ఏదో ఆరుమాసాల ముందైతే ఒప్పుకుంటారట. కాలపరిమితి తీరిపోయే ఆరుమాసాల ముందు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే అధికారం ఎన్నికలకమీషన్ కు ఉందన్న విషయం బహుశా లోకేష్ కు తెలీకపోవచ్చు.  

పైగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ముఖ్యమంత్రి ఎన్నడూ చెప్పలేదంటున్నారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవాటానికి సిద్ధంగా ఉండాలని నేతలకు, శ్రేణులకు పిలుపివ్వటంలో అర్ధం ఏమిటి? ఇక, మున్సిపల్ ఎన్నికలు జరిగితే తాను బాధ్యతలు తీసుకోవటానికి సిద్ధమని చెప్పటం విశేషం. ఆ చెప్పేదేదో మీడియాకు చెప్పే బదులు నేరుగా చంద్రబాబుకే చెప్పవచ్చుకదా?

దాదాపు ఏడాదిన్నరగా మున్సిపల్ ఎన్నికలు జరక్కుండా వాయిదా పడుతున్న సంగతి లోకేష్ కు తెలీదా? చంద్రబాబు ఏదో ఒక సాకు చెబుతూ మున్సిపల్  ఎన్నికలను ఎందుకు వాయిదా వేయిస్తున్నట్లు? 21 మంది ఫిరాయింపు ఎంఎల్ఏలతో ఎందుకు రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళే ధైర్యం చేయటం లేదు? లోకేష్ చెబుతున్నట్లుగా రాష్ట్రంలో అంత అభివృద్ధి జరిగితే శాంపుల్ గా మున్సిపల్ ఎన్నికలు, అసెంబ్లీ ఉపఎన్నికలు నిర్వహిస్తే సరిపోతుంది కదా?

ముందస్తు ఎన్నికల సంకేతాలు మొదలైనప్పటి నుండి నేతలతో కూడా చంద్రబాబు అభిప్రాయాలు సేకరించినట్లు సమాచారం. చాలామంది ముందస్తు ఎన్నికలపై పెద్దగా ఆశక్తి చూపలేదని తెలిసింది. 2003లో ముందస్తు ఎన్నకలకు వెళ్ళినపుడు ఎదురైన చేదు అనుభవాన్ని నేతలు గుర్తు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ముందస్తుకు వెళ్ళాలంటే ఏం అభివృద్ధి జరిగిందని చెప్పి ఓట్లడగాలో నేతలకు అర్ధం కావటం లేదట.

 

PREV
click me!

Recommended Stories

Varudu Kalyani Comments on Pawan Kalyan: డైలాగ్స్ వద్దు చర్యలు తీసుకోండి | Asianet News Telugu
Nara Lokesh Attends Parliament Committee Workshop Inauguration| Asianet News Telugu