ఈ నెల 29న వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి నామినేషన్

Published : Mar 24, 2021, 03:21 PM IST
ఈ నెల 29న వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి నామినేషన్

సారాంశం

తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న డాక్టర్ గురుమూర్తి ఈ నెల 29వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు.


తిరుపతి: తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న డాక్టర్ గురుమూర్తి ఈ నెల 29వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ 17న తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మరణించారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో డాక్టర్ గురుమూర్తి పాల్గొన్నారు. ఫిజియోథెరపిస్టుగా ఉన్న గురుమూర్తి పాదయాత్ర మొత్తం ఉన్నారు.బల్లి దుర్గాప్రసాద్ తనయుడికి ఎమ్మెల్సీ సీటిచ్చాడు జగన్. డాక్టర్ గురుమూర్తికి తిరుపతి ఎంపీ సీటును ఇచ్చారు.

తిరుపతి ఎంపీ స్థానంలో ఘన విజయం సాధిస్తామని వైసీపీ ధీమాను వ్యక్తం చేసింది. తిరుపతి ఎంపీ స్థానం పరిధిలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలతో సీఎం జగన్ ఇటీవల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ గురుమూర్తిని పార్టీ నేతలకు జగన్ పరిచయం చేశారు.అతి విశ్వాసంతో పనిచేయవద్దని పార్టీ నేతలకు జగన్ ఈ సమావేశంలో సూచించారు.
 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?