ఏపీ : విజయనగరం జిల్లాలో ఒకే స్కూలులో ఏడుగురికి పాజిటివ్

By Siva KodatiFirst Published Mar 24, 2021, 3:15 PM IST
Highlights

విజయనగరం జిల్లాలో కరోనా కలకలం రేపింది. సీతానగరం మండలం నిడగల్లు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏడుగురు విద్యార్ధులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మిగిలిన విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. విద్యార్ధులకు కరోనా రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

కాగా, రెండ్రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ పరిధిలోని ఓ కళాశాలలో కరోనా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కాలేజీలో చదువుకుంటున్న మొత్తం 163 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది.

గత రెండు రోజుల నుంచి వరుసగా 13, 10 చొప్పున కేసులు నమోదు అవుతుండగా.. సోమవారం ఒక్కరోజే 140 మందికి నిర్ధారణ అయిందని డీఎంహెచ్‌వో తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 700 మంది విద్యార్థుల నమూనాలు సేకరించి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.

పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిని ఒక చోట ఉంచి ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా చేశామని అధికారులు తెలిపారు. నెగెటివ్‌ వచ్చిన దాదాపు 450 మందిని వేరే హాస్టల్‌లో ఉంచామని చెప్పారు.  
 
click me!