భయాందోళనలు: కరోనా వైరస్ తో కర్నూలు డాక్టర్ మృతి

By telugu teamFirst Published Apr 16, 2020, 6:23 PM IST
Highlights
కర్నూలులో కరోనా వైరస్ తో ఓ వైద్యుడు మరణించడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వైద్యుడిని కలిసినవారి కోసం అధికారులు ఆరా తీస్తున్నారు,
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలులో వైద్యుడు మరణించడంతో తీవ్ర ఆందోళన చోటు చేసుకుంది. కరోనా వైరస్ వ్యాధితో అతను మరణించాడు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆయనతో పాటు పనిచేసిన వైద్య సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులున నిర్ణయించారు. 

గత నెల 20వ తేదీ నుంచి ఈ నెల 11వ తేదీ వరకు డాక్టర్ ను కలిసినవారి గురించి కూడా ఆరా తీస్తున్నారు. వైద్యుడిని కలిసినవారు స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఇళ్లలోంచి ఎవరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు.  

ఇదిలావుండగా, గురువారం ఉదయం లెక్కల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 534కు చేరుకుంది. కొత్తగా కృష్ణా, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో మూడేసి కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొంది 20 మంది డిశ్చార్జీ అయ్యారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 122 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 మంది మరణించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలలో 4గురు చొప్పున, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఇద్దరు చొప్పున చనిపోయారు.  విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటి వరకు ఏ విధమైన కేసులు నమోదు కాలేదు.
click me!